అంబులెన్స్ లో రూ.25 కోట్లకు పైగా దొంగనోట్లు.. అనుమానం రాకుండా తరలిస్తూ, పట్టుబడి...

By SumaBala BukkaFirst Published Oct 1, 2022, 7:45 AM IST
Highlights

గుజరాత్ లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టయ్యింది. ఓ అంబులెన్స్ లో తరలిస్తున్న రూ.25 కోట్లకు పైగా నకిలీ కరెన్నీ పట్టుబడింది. 

గుజరాత్ :  గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో పోలీసులు భారీగా దొంగ నోట్లను పట్టుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా అంబులెన్స్లో తరలిస్తున్న రూ.25.80  కోట్ల ఫేక్ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగనోట్లను తరలిస్తున్నారని పక్కా సమాచారం అందుకున్న పోలీసులు..ఆ వాహనాన్ని అడ్డగించి ఆరు పెట్టెల్లో,  2000 రూపాయల నోట్ల కట్టలు (1,290కట్టలు)ను  సీజ్ చేశారు.  అయితే, ఆ కరెన్సీపై ‘రివర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’  అని ముద్రించి ఉండడం గమనార్హం.

ఈ అంశంమీద స్థానిక ఎస్పీహితేశ్ జోయ్ సర్ మీడియాతో మాట్లాడారు. అంబులెన్స్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నామని, తదుపరి విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. నోట్లు ఎక్కడ అచ్చు వేశారు?  ఎక్కడికి ఇక్కడికి తీసుకు వెడుతున్నారో ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. ఫోరెన్సిక్ బృందం సైతం ఆధారాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు. 

పోలీసులు తనిఖీలకు వస్తే.. కాల్పులు జరిపి పారిపోయిన నిందితులు.. భార్యలు అరెస్టు

గురువారం గుజరాత్‌లోని సూరత్‌లో అంబులెన్స్‌లో రూ.25 కోట్లకు పైగా విలువ కలిగిన నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
పక్కా సమాచారంతో పోలీసులు అంబులెన్స్‌ను అడ్డగించి వాహనంలో నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆరు బాక్సుల్లో 1,290 నోట్ల కట్టలు ఉంచినట్లు గుర్తించారు. సూరత్‌లోని కమ్రెజ్ ప్రాంతంలో అంబులెన్స్‌ను అడ్డుకున్నారు. ఇదిలా ఉండగా అంబులెన్స్‌కు ఒకవైపు దిక్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ మోటవాడలా - సూరత్ అని మరో వైపు గౌమాత రాష్ట్రమాత అని రాసి ఉంది.

click me!