11 మంది పీఎఫ్ఐ వర్కర్లను 21 రోజుల కస్టడీకి పంపిన ఎన్ఐఏ కోర్టు

By Mahesh KFirst Published Oct 1, 2022, 5:12 AM IST
Highlights

కేరళలో పలు చోట్ల నుంచి అరెస్టు చేసిన 11 మంది పీఎఫ్ఐ కార్యకర్తలను ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు 20 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. గతవారం ఎన్ఐఏ వీరిని అరెస్టు చేసింది. వారిని ఏడు రోజుల కస్టడీకి అప్పుడు కోర్టు అనుమతించింది. ఈ గడువు ముగియనుండటంతో మరోసారి ప్రత్యేక కోర్టును కస్టడీ విషయమై విజ్ఞప్తి చేసింది.

న్యూఢిల్లీ: కేరళ నుంచి అరెస్టు అయిన 11 మంది పీఎఫ్ఐ లీడర్లను 21  రోజుల జ్యుడిషియల్ కస్టడీకి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు పంపింది. అక్టోబర్ 20వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీకి అనుమతించింది. గతవారం ఎన్ఐఏ కేరళలోని పలు ప్రాంతాల నుంచి అరెస్టు చేసిన వీరిని అప్పుడు ఎన్ఐఏకోర్టు ముందు హాజరుపరిచిన సంగతి తెలిసిందే. కోర్టు వారిని ఏడు రోజుల కస్టడీలో ఉంచడానికి అనుమతించింది. అయితే, ఈ ఏడు రోజులు ముగియనుండటంతో మరోసారి ఎన్ఐఏ.. ప్రత్యేక కోర్టులో వారిని హాజరు పరిచింది. మరికొంత కాలం వారిని జ్యుడిషియల్ కస్టడీలో ఉంచుకోవడానికి అనుమతించాలని కోరింది. ఇందుకు ఎన్ఐఏ కోర్టు అంగీకరించింది.

కాగా, పీఎఫ్ఐ జనరల్ సెక్రెటరీ అబ్దుల్ సత్తార్ పరారీలో ఉన్నాడు. ఆయనను పోలీసులు కొల్లాంలో బుధవారం పట్టుకున్నారు. అబ్దుల్ సత్తార్‌ను తమ కస్టడీలోకి తీసుకోవడానికి అనుమతించాలని తాజాగా ఎన్ఐఏ కోర్టు కోరింది. ఏడు రోజుల జ్యుడీషియల్ కస్టడీ కోసం విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తిని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు సోమవారం తమ పరిగణనలోకి తీసుకోనుంది.

పీఎఫ్ఐ పై ఎన్‌ఐఏ, ఇతర దర్యాప్తు ఏజెన్సీలు దేశవ్యాప్తంగా రెండు సార్లు రైడ్లు చేసింది. తొలి రౌండ్‌లో కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, ఢిల్లీ, అసోం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, పశ్చిమ బెంగాల్, బిహార్, మణిపూర్‌లలోని 93 లొకేషన్‌లలో సెర్చ్‌లు నిర్వహించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి ఎన్ఐఏ ఐదు కేసులు దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి పీఎఫ్ఐ టాప్ లీడర్లు, దాని సభ్యుల కార్యాలయాలపై తొలి రౌండ్ రైడ్లు చేపట్టింది. 

ఉగ్రవాద కార్యకలాపాలు, ఉగ్రవాదానికి వీరు ఫండింగ్ ఇస్తున్నారనే ఆరోపణలు చేస్తున్నది. అలాగే, సాయుధ శిక్షణకు ట్రైనింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నదని, నిషేధ ఉగ్రవాద సంస్థల్లో చేరడానికి అమాయక ప్రజలను ర్యాడికలైజ్ చేస్తున్నదని ఎన్ఐఏ ఆరోపణలు చేసింది.

రెండో రౌండ్లో భాగంగా ఎన్ఐఏ ఎనిమిది రాష్ట్రాల్లో రైడ్లు చేపట్టింది. రెండో రౌండ్లో చాలా మంది పీఎఫ్ఐ సభ్యులను అదుపులోకి తీసుకుంది.

click me!