Amritpal Singh: సోషల్ మీడియాలో అమృత్ పాల్ సింగ్ కు సంబంధించిన అనేక విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అమృత్‌పాల్ సింగ్ అమ్మాయిలకు తెలియకుండా వారి అసభ్య వీడియోలను రికార్డు చేసి, వాటితో బ్లాక్ మెయిల్ చేసినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
Amritpal Singh case: కరుడుగట్టిన ఖలిస్థానీ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ గురించిన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఉగ్రవాద సంస్థలు, పాకిస్తాన్ ఐఎస్‌ఐతో సంబంధాలున్నాయని ప్రథమికంగా గుర్తించిన అధికారులను తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే అతనికి సంబంధించిన రాసలీలల విషయాలు వెలుగులోకి రావడంతో అందరూ ఆశ్చర్యపోవడంతో పాటు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ యాంగిల్ కూడా ఉందా? అనుకుంటున్నారు.
సోషల్ మీడియాలో అమృత్ పాల్ సింగ్ కు సంబంధించిన అనేక విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అమృత్‌పాల్ సింగ్ అమ్మాయిలకు తెలియకుండా వారి అసభ్య వీడియోలను రికార్డు చేసి, వాటితో బ్లాక్ మెయిల్ చేసినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇతనికి చాలా మంది అమ్మాయిలు, వివాహితలతో సంబంధాలు ఉన్నాయని కూడా సమాచారం. పలువురు మహిళలతో ఆయన అమృత్ పాల్ సింగ్ చేసిన చాట్ కు సందేశాలు కనిపించాయి. వీటిలో కనిపించిన ఒక మెసేజ్ లో తనకు సాధారణ రిలేషన్‌షిప్ మాత్రమే కావాలని, సీరియస్ రిలేషన్‌షిప్ కోరుకోవడం లేదని వాయిస్ మెసేజెస్‌లో చెప్పాడు. ఒక మహిళ తన వివాహ సంబంధంపై ప్రభావం పడనంతవరకు వివాహేతర సంబంధాన్ని కొనసాగించేందుకు అంగీకరించిందని కూడా ఒక మెసెజ్ లో చెప్పుకోవడం గమనార్హం.
సోషల్ మీడియా ఖాతాలలో అమృత్‌పాల్ సింగ్, అమ్మాయిలతో చేసిన చాటింగ్ లిస్ట్ పెద్దగానే ఉన్నట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇన్‌స్టాగ్రాంలో చాలా మంది యువతులకు మెసేజ్‌లు చేసినట్టు సమాచారం. వివాహేతర సంబంధాలు, హనీమూన్, అమ్మాయిలతో కేవలం రాసలీలల సంబంధాల కోరుకోవడం వంటి మెసేజ్ లు కూడా ఉన్నాయి. ఈ విషయాలు వైరల్ కావడంతో అమృత్ పాల్ సింగ్ లో ఈ కోణం కూడా ఉందా అని అనుకుంటున్నారు.
ఇదిలావుండగా, పరారీలో ఉన్న అమృత్ పాల్ సింగ్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. మారువేషంలో పోలీసులకు దొరక్కుండా తిరుగుతున్నాడని సమాచారం.