కొడుకు సమాధిపై క్యూఆర్ కోడ్ ఏర్పాటు.. తల్లిదండ్రులు ఏమంటున్నారో తెలుసా?

By Mahesh KFirst Published Mar 23, 2023, 2:20 PM IST
Highlights

కేరళలో వైద్యుడిగా చేసిన ఓ యువకుడు అకాల మరణం చెందాడు. ఎంతో ప్రతిభ, నైపుణ్యాలు గల అతడు రెండేళ్ల క్రితం మరణించాడు. అతని ప్రతిభ నలుగురికి తెలియాలని తల్లిదండ్రులు కొడుకు సమాధిపై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు.
 

న్యూఢిల్లీ: కడుపు చించుకుని పుట్టిన బిడ్డలు కళ్ల ముందే రాలిపోతే తల్లిదండ్రులకు ఉండే కడుపు కోత అంతా ఇంతా కాదు. తమకు తల కొరివి పెడతాడనుకున్న కొడుక్కి తామే తల కొరివి పెడుతున్నామా? అంటూ శోకసంద్రంలో మునిగిపోతారు. కొడుకు చేసిన పనులు, సాధించిన విజయాలను తలుచుకుని పొంగిపోతారు.. కూలిపోతారు. అంతేకాదు, ఇతరులతో కొడుకు జ్ఞాపకాలను చెబుతూ మనసును కుంపటి చేసుకుంటారు. ఇలాగే కేరళకు చెందిన తల్లిదండ్రులు కీర్తిశేషుడైన కొడుకు విజయాలను ప్రపంచానికి చాటి చెప్పాలని అనుకున్నారు. అందుకే కొడుకు సమాధిపై ఓ క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు.

డాక్టర్ ఇవిన్ ఫ్రాన్సిస్ అనే యువకుడు వైద్యుడిగా పని చేశాడు. రెండేళ్ల క్రితం బ్యాడ్మింట్ ఆడుతూ హఠాన్మరణం చెందాడు. 26 ఏళ్ల వయసులోనే ఆయనకు నూరేళ్లు నిండాయి. పిన్న వయసులో మరణించిన ఆ వైద్యుడి విజయాలు మాత్రం ఇంకా మాట్లాడుతూనే ఉన్నాయి. అతని ప్రతిభ ఇప్పటికీ ఆయనను గురించిన చర్చను లేవదీస్తూనే ఉన్నది. 

Also Read: హిండెన్‌బర్గ్ మరో సంచలనం.. ఇంకో బిగ్ రిపోర్టుతో వస్తున్నామంటూ ట్వీట్.. ఈసారి ఎవరికి మూడిందో..?

అందుకే తమ కొడుకు గురించి ప్రపంచానికి తెలియజేయాలని ఆ తల్లిదండ్రులు కొడుకు సమాధిపై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే.. డాక్టర్ ఇవిన్ ఫ్రాన్సిస్‌కు సంబంధించిన వీడియోలు అందుబాటులోకి వస్తాయి. తమ కొడుకు ప్రతిభ, నైపుణ్యాలు తెలిపే వీడియోలతో డాక్టర్ ఇవిన్ ఫ్రాన్సిస్ కుటుంబం ఓ వెబ్ పేజీ రూపొందించింది. అతని సమాధిపై ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఈ వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. డాక్టర్ ఇవిన్ ఫ్రాన్సిస్ జీవితం ఇతరులకు స్ఫూర్తినివ్వాలని ఈ ఏర్పాటు చేసినట్టు తల్లిదండ్రులు చెప్పారు.

click me!