హిండెన్‌బర్గ్ మరో సంచలనం.. ఇంకో బిగ్ రిపోర్టుతో వస్తున్నామంటూ ట్వీట్.. ఈసారి ఎవరికి మూడిందో..?

By Mahesh KFirst Published Mar 23, 2023, 2:12 PM IST
Highlights

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మరో సంచలనానికి తెర తీస్తున్నది. తాము మరో బిగ్ రిపోర్ట్‌తో వస్తున్నామంటూ ట్వీట్ చేసింది. త్వరలోనే ఈ రిపోర్ట్ వస్తుందని పేర్కొంది. అదానీ గ్రూప్ పై ఈ సంస్థ విడుదల చేసిన రిపోర్టు జాతీయ రాజకీయాలను కుదిపేసింది. అదానీ గ్రూప్ స్టాక్ 
 

న్యూఢిల్లీ: అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మరో సంచలనానికి తెర తీయనుంది. ఇప్పటికే అదానీ సామ్రాజ్యంలో చిచ్చు రేపిన ఈ సంస్థ మరో బిగ్ రిపోర్ట్‌తో వస్తున్నామంటూ ట్వీట్ చేసింది. దీంతో ఈ సారి ఎవరికి మూడిందో అనే ప్రశ్న ఉదయిస్తున్నది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్టు తర్వాత సుమారు ఐదు వారాల వ్యవధిలో అదానీ గ్రూప్‌ నుంచి 150 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయాయి.

గురువారం ఉదయం హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఓ ట్వీట్ చేసింది. కొత్త రిపోర్ట్ త్వరలో వెలువడనుంది అని ట్వీట్ చేసింది. మరో బిగ్ రిపోర్ట్‌ రానుంది అంటూ పేర్కొంది. అయితే, ఈ సారి ఎవరిని టార్గెట్ చేశారో వివరించలేదు. ఏ కంపెనీ కేంద్రంగా పరిశోధనలు చేశారో.. ఎలాంటి ఫ్రాడ్‌ను వెలికి తేనున్నారో వంటి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించలేదు. ఈ విషయాల కోసం మరికొంత కాలం వేచి ఉండాల్సిందే అని అర్థం అవుతున్నది. ఈ రిపోర్టు మన దేశానికి చెందిన సంస్థపైనేనా? లేక ఇతర దేశాలకు చెందిన సంస్థపై వస్తున్నదా? అనే చర్చ కూడా మొదలైంది.

New report soon—another big one.

— Hindenburg Research (@HindenburgRes)

అదానీ గ్రూప్స్ పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ భారీ దెబ్బ తీసింది. చట్ట వ్యతిరేకంగా పన్ను స్వర్గధామాల నుంచి పెట్టుబడులు స్వీకరించిందని, స్టాక్ మ్యానిపులేషన్‌తో అదానీ గ్రూప్ స్టాక్‌ విలువలు గణనీయంగా పెంచుకుందని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన ఆరోపణలు చేసింది. జనవరి 24వ తేదీన రిలీజ్ చేసిన ఈ రిపోర్టు అదానీ గ్రూపుపై స్టాక్ మ్యానిపులేషన్ చేసిందని, అకౌంటింగ్ ఫ్రాడ్‌లకూ పాల్పడిందని ఆరోపించింది. పన్నులు విధించని కొన్ని దీవుల్లోని షెల్ కంపెనీల నుంచి తమ గ్రూపులో పెట్టుబడులు పెట్టుకుని స్టాక్ విలువ పెంచుకుందని పేర్కొంది.

Also Read: బిలియనీర్ల జాబితాలో టాప్ లూజర్ గా గౌత‌మ్ అదానీ.. మ‌రోసారి షేర్ల క్షీణ‌త..

కాగా, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ చేసిన ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. అవన్నీ నిరాధార, కుట్రపూరిత ఆరోపణలు అని అదానీ గ్రూప్ పేర్కొంది. ఆ రిపోర్టును భారతదేశంపై దాడిగా అభివర్ణించింది. 

అదానీ గ్రూపు ఖండనలకూ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రియాక్ట్ అయింది. 413 పేజీలతో ఓ డిటెయిల్డ్ రెస్పాన్స్ ఇచ్చింది.

click me!