పశ్చిమ బెంగాల్ లో అక్రమ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ముగ్గురు మృతి

By Asianet NewsFirst Published Mar 21, 2023, 9:40 AM IST
Highlights

అక్రమంగా నిర్వహిస్తున్న బాణాసంచా తయారీ యూనిట్ లో పేలుడు సంభవించడంతో ముగ్గురు చనిపోయారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 

పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని నివాస ప్రాంతంలోని అక్రమ బాణసంచా తయారీ యూనిట్ లో సోమవారం సాయంత్రం పేలుడు సంభవించింది. ఈ పేలుడు వల్ల పెద్ద ఎత్తున మంటల చెలరేగాయి. దీనిని ఆర్పేందుకు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సిబ్బంది ఎంతో కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

సినీనటి సహాయకుడికి జాక్ పాట్.. లాటరీలో పదికోట్లు వరించింది.. ఎక్కడంటే...

వివరాలు ఇలా ఉన్నాయి. 24 పరగణాల జిల్లా మహేస్తలాలోని ఓ ఇంట్లో ఓ కుటుంబం అక్రమంగా బాణసంచా తయారీ యూనిట్ ను నిర్వహిస్తోంది. అయితే సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఇంట్లో ఒక్క సారిగా పేలుడు సంభవించింది. దీంతో మంటలు అంటుకున్నాయి. ఈ మంటల్లో ఇంటి యజమాని, అతడి భార్య, కుమారుడు సజీవదహనం అయ్యారు. 

ఈ ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక యంత్రాలు, ఇతర అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రాంతం రద్దీగా ఉండటం, బలమైన గాలులు వీయడంతో త్వరగా మంటలు వ్యాపించాయి. రెస్క్యూ టీం ఎంతో కష్టపడి మంటలను చల్లార్చారు. అయితే లోపకలి వెళ్లి చూడటంతో మూడు మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని ‘హిందుస్థాన్ టైమ్స్’ నివేదించింది. 

ఈవెంట్ లో డ్యాన్స్ చేస్తూ.. గుండెపోటుతో ప్రభుత్వోద్యోగి మృతి..

ఫోరెన్సిక్ అధికారుల బృందం సంఘటనా స్థలాన్ని సందర్శించి నమూనాలను సేకరించింది. ఈ మంటలకు గల కారణాన్నితెలుసుకునేందుకు దర్యాప్తు చేపడుతోంది. అయితే ఈ నివాస ప్రాంతంలో యూనిట్ ఎలా నడుస్తోందో పరిశీలించడానికి దర్యాప్తునకు ఆదేశిస్తామని మంత్రి సుజిత్ బోస్ హామీ ఇచ్చారు.

అమృత్ పాల్ సింగ్ వెనుక ఐఎస్ఐ, విదేశీ నిధులు, మాదకద్రవ్యాల ముఠాల సహకారం..!!

తమిళనాడులోనూ ఇటీవల ఇలాంటి ఘటనే జరిగింది. ధర్మపురి జిల్లా నాగరసంపట్టి సమీపంలోని ఓ ప్రైవేటు బాణసంచా తయారీ కంపెనీ గోడౌన్ లో ఈ నెల 16వ తేదీన పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరొకరికి గాయాలు అయ్యాయి. ఈ పేలుడు వల్ల భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. మృతులను నాగతసంపట్టి గ్రామానికి చెందిన పళనియమ్మాళ్, మునియమ్మాళ్‌గా గుర్తించారు. క్షతగాత్రులను రక్షించి సమీపంలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. పేలుడు కారణంగా ఆ ప్రాంతానికి 2 కిలో మీటర్ల సమీపంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పేలుడు కారణంగా సమీపంలోని భవనాల పైకప్పులు మరియు గోడలు పగుళ్లు ఏర్పడ్డాయి. 

click me!