Rohini Court: ఢిల్లీ రోహిణి కోర్టులో పేలుడు కలకలం.. బయటకు పరుగులు తీసిన లాయర్లు

Published : Dec 09, 2021, 12:42 PM IST
Rohini Court: ఢిల్లీ రోహిణి కోర్టులో పేలుడు కలకలం.. బయటకు పరుగులు తీసిన లాయర్లు

సారాంశం

ఢిల్లీలోని రోహిణి కోర్టులో (Rohini Court) గురువారం పేలుడు సంభవించడం తీవ్ర కలకలం రేపింది. అనుమాస్పద స్థితితో ఈ పేలుడు (Explosion) సంభవించింది. దీంతో కోర్టు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు.

ఢిల్లీలోని రోహిణి కోర్టులో (Rohini Court) గురువారం పేలుడు సంభవించడం తీవ్ర కలకలం రేపింది. అనుమాస్పద స్థితితో ఈ పేలుడు (Explosion) సంభవించింది. దీంతో కోర్టు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. కోర్టులోని ఓ గదిలో పేలుడు సంభవించినట్టుగా తెలుస్తోంది. దీంతో లాయర్లు వెంటనే అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకున్నారు. కోర్టులో ల్యాప్‌టాప్ పేలి ఉండవచ్చని ప్రాథమిక నివేదికలు పేర్కొన్నాయి అయితే ఇందుకు సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు. 

రోహిణి కోర్టులో పేలుడు సంభవించినట్టుగా అగ్నిమాపక శాఖకు ఉదయం 10. 40 గంటలకు సమాచారం అందింది. దీంతో ఏడు అగ్నిమాపక యంత్రాలు కూడా ఘటన  స్థలానికి చేరుకున్నాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్