Bipin Rawat : వైరల్ గా మారిన.. హెలికాప్టర్ ప్రమాదానికి ముందు దృశ్యాలు....(వీడియో)

By SumaBala BukkaFirst Published Dec 9, 2021, 12:31 PM IST
Highlights

ఈ దృశ్యాలను స్థానికులు సెల్ ఫోన్ లో రికార్డ్ చేశారు. ఇప్పుడు ఇవి viral అవుతున్నాయి. ఈ ప్రమాదంపై ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగిందా? లేక మరేదైనా కారణమా? అనే కోణంలో కూడా వాయుసేన అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారు.

కున్నూర్ : సీడీఎస్ జనరల్ Bipin Rawat ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి ముందు దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదం చివరి క్షణంలో హెలికాప్టర్.. దట్టమైన పొగమంచులోకి వెళ్లిపోవడం ఈ దృశ్యాల్లో కనిపిస్తోంది. ఆ తర్వాత హెలికాప్టర్ కుప్పకూలిపోయినట్లు తెలుస్తోంది. 

"

ఈ దృశ్యాలను స్థానికులు సెల్ ఫోన్ లో రికార్డ్ చేశారు. ఇప్పుడు ఇవి viral అవుతున్నాయి. ఈ ప్రమాదంపై ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగిందా? లేక మరేదైనా కారణమా? అనే కోణంలో కూడా వాయుసేన అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారు.

మరోవైపు హెలికాప్టర్ ప్రమాదస్థలిని వాయుసేన అధికారులు ఈ ఉదయం పరిశీలించారు. ఘటనాస్థలి నుంచి బ్లాక్ బాక్స్ ని స్వాధీనం చేసుకున్నారు. హెలికాప్టర్ కూలిన ప్రదేశానికి 30అడుగుల దూరంలో దీన్ని గుర్తించారు. ప్రమాద దర్యాప్తులో బ్లాక్ బాక్స్ కీలకం కానుంది. అందులో నమోదైన సంభాషణల ఆధారంగా ప్రమాదానికి కారణాలు తెలుసుకునే వీలుంది. దీన్ని డీకోడ్ చేసేందుకు డిల్లీకి తరలించే అవకాశం ఉంది. 

ఇదిలా ఉండగా, హెలికాఫ్టర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ Gen Bipin Rawat, ఆయన సతీమణి మధులికా రావత్, ఇతర సీనియర్ అధికారులకు పార్లమెంట్‌ ఉభయసభలలో శ్రద్దాంజలి ఘటించారు. వారి మృతిపట్ల ఉభయసభలు సంతాపం వ్యక్తం చేశాయి. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

Bipin Rawat: బిపిన్ రావత్ భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం స్టాలిన్, తెలంగాణ గవర్నర్ తమిళిసై

ఈ ప్రమాదానికి సంబంధించి తొలుత లోక్‌సభలో, తర్వాత రాజ్యసభలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన చేశారు. బుధవారం ఉదయం 11.48 గంటలకు సూలురు ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన హెలికాఫ్టర్‌కు.. మధ్యాహ్నం 12.08 గంటలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంకేతాలు నిలిచిపోయాయని చెప్పారు. భారీ శబ్దం రావడంతో స్థానికకులు అక్కడికి వెళ్లారని తెలిపారు. స్థానికులు అక్కడికి చేరుకుని సరికి హెలికాఫ్టర్ మంట్లో ఉందని చెప్పారు. 

జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్‌తో మొత్తం 13 మంది మరణించినట్టుగా చెప్పారు. మృతుల భౌతికకాయాలను నేడు ఢిల్లీకి తీసుకురానున్నట్టుగా రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ రావత్ అంత్యక్రియను పూర్తి సైనిక గౌరవాలతో నిర్వహించనున్నట్టుగా చెప్పారు. మరణించిన వ్యక్తులకు నివాళులర్పిస్తున్నట్టుగా చెప్పారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు.

గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ వెల్లింగ్టన్‌లోని మిలటరీ హాస్పిటల్‌లో లైఫ్ సపోర్ట్‌పై చికిత్స పొందుతున్నట్టుగా రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అతని ప్రాణాలను రక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చెప్పారు.

నీలగిరి జిల్లా వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కళాశాలలో సిబ్బంది, శిక్షణలో ఉన్న అధికారులను ఉద్దేశించి జనరల్‌ బిపిన్ రావత్‌ బుధవారం ప్రసంగించాల్సి ఉంది. ఇందుకోసం భార్య మధులిక రావత్, మరికొంతమంది సైనిక ఉన్నతాధికారులతో కలిసి ఆయన ఢిల్లీ నుంచి బుధవారం ఉదయం తమిళనాడు బయలుదేరారు. బుధవారం ఉదయం 11.34 గంటలకు కోయంబత్తూరు జిల్లా సూలూర్‌‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి 11:48 గంటలకు భారత వాయుసేనకు చెందిన ఎంఐ-17వీ5 హెలికాప్టర్‌లో వెల్లింగ్టన్‌కు బయలుదేరారు. అయితే మధ్యాహ్నం 12.20 గంటల ప్రాంతంలో హెలికాఫ్టర్ కున్నూరు సమీపంలో కూలిపోయింది. 

click me!