Bipin Rawat: బిపిన్ రావత్ భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం స్టాలిన్, తెలంగాణ గవర్నర్ తమిళిసై

By Sumanth KanukulaFirst Published Dec 9, 2021, 12:19 PM IST
Highlights

హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతిచెందిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ (Gen Bipin Rawat), ఇతర సైనికాధికారుల భౌతికకాయాలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్  (MK Stalin), తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ (Tamilisai Soundararajan) నివాళులర్పించారు.

హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతిచెందిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ (Gen Bipin Rawat), ఇతర సైనికాధికారుల భౌతికకాయాలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్  (MK Stalin) నివాళులర్పించారు. బుధవారం హెలికాఫ్టర్‌లో మృతిచెందిన బిపిన్ రావత్‌తో సహా ఇతర సైనికాధికారుల భౌతికకాయాలను తమిళనాడు నీలగిరి జిల్లాలోని మద్రాస్ రెజిమెంటల్ సెంటర్‌లో ఉంచారు. అక్కడ వారి భౌతికకాయాలకు.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ (Tamilisai Soundararajan), ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరి నివాళులర్పించారు. జనరల్‌ బిపిన్ రావత్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం సూలూరు బేస్ క్యాంపుకు బిపిన్ రావత్ దంపతుల భౌతికకాయాన్ని తరలించనున్నారు. అక్కడి నుంచి గురువారం సాయత్రం ఢిల్లీలోని పాలెం విమానాశ్రయానికి వారి భౌతికకాయాలు చేరుకుంటాయి. అనంతరం రావత్‌ దంపతుల భౌతికకాయాలను కోయంబత్తూరుకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి వాయుమార్గంలో ఢిల్లీకి తరలిస్తారు. గురువారం సాయంత్రం వారి భౌతికకాయాలు ఢిల్లీకి చేరుకుంటాయి. అనంతరం రావత్ దంపతుల భౌతికకాయాలను.. ఢిల్లీలోని వారి నివాసానికి తరలిస్తారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ప్రజలు నివాళులర్పించడానికి అనమతిస్తారు. ఆ తర్వాత కామరాజ్ మార్గ్ నుంచి ఢిల్లీ కంటోన్మెంట్‌లో స్క్వేర్ శ్మశానవాటిక వరకు అంతిమాయాత్ర సాగనుంది. అక్కడ శుక్రవారం సాయంత్రం రావత్ దంపతుల అంత్యక్రియలను (Bipin Rawat Funerals) నిర్వహించనున్నారు.


గురువారం.. హెలికాఫ్టర్ ప్రమాదానికి సంబంధించి తొలుత లోక్‌సభలో, తర్వాత రాజ్యసభలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ (Defence Minister Rajnath Singh) సింగ్ ప్రకటన చేశారు. బుధవారం ఉదయం 11.48 గంటలకు సూలురు ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన హెలికాఫ్టర్‌కు.. మధ్యాహ్నం 12.08 గంటలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంకేతాలు నిలిచిపోయాయని చెప్పారు. భారీ శబ్దం రావడంతో స్థానికకులు అక్కడికి వెళ్లారని తెలిపారు. స్థానికులు అక్కడికి చేరుకుని సరికి హెలికాఫ్టర్ మంట్లో ఉందని చెప్పారు. జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్‌తో మొత్తం 13 మంది మరణించినట్టుగా చెప్పారు. 

మృతుల భౌతికకాయాలను నేడు ఢిల్లీకి తీసుకురానున్నట్టుగా రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ రావత్ అంత్యక్రియను పూర్తి సైనిక గౌరవాలతో నిర్వహించనున్నట్టుగా చెప్పారు. మరణించిన వ్యక్తులకు నివాళులర్పిస్తున్నట్టుగా చెప్పారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు.గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ వెల్లింగ్టన్‌లోని మిలటరీ హాస్పిటల్‌లో లైఫ్ సపోర్ట్‌పై చికిత్స పొందుతున్నట్టుగా రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అతని ప్రాణాలను రక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చెప్పారు. ఈ ప్రమాదంపై ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ (Air Marshal Manavendra Singh) నేతృత్వంలో దర్యాప్తు జరుగుతుందిని వెల్లడించారు.

click me!