ఏప్రిల్ 19వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ఎగ్జిట్ పోల్స్ పై ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ తో పాటు అన్ని రకాల మీడియాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు మీడియా సంస్థలు, సర్వే సంస్థలు ఒపీనియన్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. అయితే ఏప్రిల్ 19వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం, ప్రచురించడం, ప్రచారం చేయడంపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
లోక్ సభ ఎన్నికలు.. రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో బీజేపీ మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు..
undefined
ఏప్రిల్ 19న ఉదయం 7 గంటల నుంచి జూన్ 1వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని పేర్కొంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో సహా అన్ని రకాల మీడియాకు ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది.
పీవీ, చౌదరి చరణ్ సింగ్ సహా ఐదుగురికి భారత రత్న అవార్డులు: ప్రదానం చేసిన రాష్ట్రపతి
ఆయా రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు 48 గంటల వ్యవధిలో ఒపీనియన్ పోల్స్ ఫలితాలు లేదా మరే ఇతర సర్వే ఫలితాలతో సహా ఎన్నికలకు సంబంధించిన కంటెంట్ ను మీడియాలో ప్రసారం చేయడం నిషేధించామని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.
ఒక్క ఎమ్మెల్యేను టచ్ చేసినా ప్రభుత్వం పడిపోతుంది - ఏలేటి మహేశ్వర్ రెడ్డి
కాగా.. మొత్తం 543 లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 10.5 లక్షల పోలింగ్ కేంద్రాల్లో 44 రోజుల పాటు జరిగిన పోలింగ్ ప్రక్రియలో 49.7 కోట్ల మంది పురుషులు, 47.1 కోట్ల మంది మహిళలు మొత్తం 97 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.