ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని ప్రధాని మోడీ యోచన - కాంగ్రెస్ నేత జైరాం రమేష్

By Sairam Indur  |  First Published Mar 30, 2024, 3:52 PM IST

ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ అన్నారు. ఐటీ శాఖ నుంచి తమకు మరో రెండు నోటీసులు అందాయని వెల్లడించారు.


రూ.1,800 కోట్లకు పైగా పన్ను నోటీసులు తమకు అందిన మరుసటి రోజే ఆదాయపు పన్ను శాఖ నుంచి మరో రెండు నోటీసులు వచ్చాయని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. శుక్రవారం రాత్రి తమకు మరో రెండు నోటీసులు పంపినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

పీవీ, చౌదరి చరణ్ సింగ్ సహా ఐదుగురికి భారత రత్న అవార్డులు: ప్రదానం చేసిన రాష్ట్రపతి

Latest Videos

ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని జైరాం రమేష్ ఆరోపించారు. కాగా, ఆదాయపు పన్ను శాఖ నుంచి తనకు నోటీసులు అందాయని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేర్కొన్నారు. ‘‘నిన్న రాత్రి ఆదాయపు పన్ను శాఖ నుంచి నాకు నోటీసులు వచ్చాయి. నేను షాక్ అయ్యాను. అప్పటికే ఆ విషయం క్లోజ్ అయిపోయింది. కాంగ్రెస్, ఇండియా కూటమిని చూసి భయపడుతున్నారు.’’ అని విమర్శించారు. 

ఇదిలా ఉండగా.. సుమారు రూ.1,823 కోట్లు చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ నుంచి తమకు తాజాగా నోటీసులు అందాయని కాంగ్రెస్ పార్టీ శుక్రవారం తెలిపింది. పన్ను పునఃసమీక్షకు వ్యతిరేకంగా ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన కొన్ని గంటల్లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. 2017-18, 2020-21 అసెస్మెంట్ సంవత్సరాలకు సంబంధించి జరిమానా, వడ్డీతో సహా నోటీసులు జారీ చేశారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం: ఢిల్లీ మంత్రి కైలాస్ గెహ్లాట్ కు ఈడీ నోటీసులు

లోక్ సభ ఎన్నికలకు ముందు తమను ఆర్థికంగా దెబ్బతీసేందుకు బీజేపీ ట్యాక్స్ టెర్రరిజానికి పాల్పడుతోందని ఆ పార్టీ ఆరోపించింది. పన్ను అధికారులు తమపై నాలుగేళ్ల పాటు పన్ను పునఃసమీక్ష చర్యలను ప్రారంభించడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు గురువారం తోసిపుచ్చింది.

click me!