Exclusive: థియేటర్ కమాండ్‌ వైపు అడుగులు.. 100 మంది త్రివిధ దళాల అధికారులకు క్రాస్ పోస్టింగ్స్!

By Sumanth KanukulaFirst Published May 30, 2023, 9:36 AM IST
Highlights

ఇండియన్ మిలిటరీలో ఏకీకరణ, ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్‌(ఐటీసీ) ఏర్పాటు దిశగా ఒక అడుగు ముందుకు పడనుంది. ఇందులో భాగంగా త్రివిధ దళాలకు చెందిన 100 మంది జూనియర్ ఆఫీసర్లు క్రాస్ పోస్టు చేయబడతారు.

ఇండియన్ మిలిటరీలో ఏకీకరణ, ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్‌(ఐటీసీ) ఏర్పాటు దిశగా ఒక అడుగు ముందుకు పడనుంది. ఇందులో భాగంగా త్రివిధ దళాలకు చెందిన 100 మంది జూనియర్ ఆఫీసర్లు క్రాస్ పోస్టు చేయబడతారు. ఈ జూనియర్-స్థాయి అధికారులు ఏవియేషన్, ఇంజినీరింగ్, లాజిస్టిక్స్, క్షిపణులు, వైమానిక రక్షణ వంటి సాధారణ (కంబైన్డ్) సేవలను కలిగి ఉన్న ప్రాంతాలకు పోస్ట్ చేయబడతారు. త్వరలో వీరు ఇంటర్-సర్వీస్ పోస్టింగ్‌లలో భాగమవుతారు. మొదటి బ్యాచ్‌లో భారత సైన్యం నుంచి మొత్తం 40 మంది, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి 30 మంది చొప్పున అధికారులు క్రాస్-పోస్ట్ చేయబడతారు.

ఈ అధికారులు మేజర్లు, లెఫ్టినెంట్ (లెఫ్టినెంట్) కల్నల్ ర్యాంక్‌లకు సమానం. ఇండియన్ నేవీ నుంచి లెఫ్టినెంట్ కమాండర్లు, కమాండర్ల స్థాయి అధికారులు క్రాస్-పోస్టింగ్‌లలో భాగంగా ఉంటారు. ఇక, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి.. ఎయిర్ ఫోర్స్ స్క్వాడ్రన్ లీడర్స్, వింగ్ కమాండర్ల స్థాయి నుంచిక్రాస్-పోస్టింగ్‌లను కలిగి ఉంటుంది.

మొదటి బ్యాచ్‌లో ఇండియన్ ఆర్మీకి చెందిన 40 మంది, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ల నుంచి 30 మంది చొప్పున అధికారులు క్రాస్-పోస్ట్ చేయబడతారని రక్షణ శాఖలోని ఒక మూలం Asianet Newsableకు తెలిపింది. అయితే దీనికి ముందు.. కల్నల్ స్థాయిలో ఒకరిద్దరు అధికారులను ఐటీసీ ఏర్పాటు ప్రధాన కార్యాలయంలో నియమించేవారు.

ఇక, ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ నిర్మాణాలు ఇంకా వెలుగు చూడలేదనే చెప్పాలి. అయితే త్రివిధ దళాలు ఉమ్మడి పోరాట బలగాలను తయారు చేసే ప్రక్రియను ప్రారంభించాయి. ‘‘ఈ జూనియర్ స్థాయి అధికారులు ఏవియేషన్, ఇంజనీరింగ్, లాజిస్టిక్స్, క్షిపణులు, వాయు రక్షణ వంటి సాధారణ (కంబైన్డ్) సేవా వాతావరణాలను కలిగి ఉన్న ప్రాంతాలకు పోస్ట్ చేయబడతారు’’ అని సంబంధిత మూలం తెలిపింది. 

జూనియర్ అధికారులను ఎన్నుకోవడానికి గల కారణాన్ని అడిగినప్పుడు.. ‘‘సేవలను ఉమ్మడిగా ఉంచడం, థియేటర్ కమాండ్‌ను రూపొందించాలనే ఆలోచన ద్వారా ఈ నిర్ణయం తీసుకోబడింది. ఈ అధికారులు ఒకరి ప్రక్రియలు, అభ్యాసాలను మరొకరు తెలుసుకుంటారు. సేవా వాతావరణంపై వారికి మంచి అవగాహన కూడా ఉంటుంది. వారు ప్రధాన కార్యాలయం లేదా నిర్మాణాల వద్ద మాత్రమే కాకుండా యూనిట్ స్థాయిలో కూడా మోహరించబడతారు’’ అని మరో మూలం తెలిపింది. 

‘‘ఉద్యోగం స్వభావం సారూప్యమైన, అమలులో సాధారణంగా ఉండే ప్రాంతాలలో ఇంటర్-సర్వీస్ పోస్టింగ్ చేయబడుతుంది’’ అని పేర్కొంది. అయితే ఎవరిని ఆన్‌ బోర్డ్ యుద్ద నౌకలలో పోస్టు చేయడం లేదని స్పష్టం చేసింది. 

ఇక, సాయుధ దళాల సైనిక ఆస్తులను ఒకే కమాండర్ కింద ఉండేలా సాయుధ బలగాలను పునర్నిర్మించడానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అది థియేటర్ కమాండ్ కింద అన్ని కార్యకలాపాలకు బాధ్యత వహిస్తుంది. మొత్తంగా ఐదు థియేటర్ కమాండ్‌లు.. ఎయిర్ డిఫెన్స్ థియేటర్ కమాండ్, మారిటైమ్ థియేటర్ కమాండ్, వెస్ట్రన్ కమాండ్, ఈస్టర్న్ కమాండ్, నార్తర్న్ కమాండ్ (జమ్మూ & కాశ్మీర్ మరియు లడఖ్) లు ఉంటాయి. 

ప్రస్తుతం త్రివిధ దళాలకు 17 కమాండ్‌లు ఉన్నాయి. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్‌కు ఒక్కొదానికి ఏడు కమాండ్‌లు, నేవీకి మూడు కమాండ్‌లు ఉన్నాయి. ప్రస్తుతం, భారతదేశం రెండు ఆపరేషనల్ ట్రై-సర్వీసెస్ కమాండ్‌లను కలిగి ఉంది. అవి స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్, అండమాన్ అండ్ నికోబార్ కమాండ్. ఇటీవల, రెండు కొత్త విభాగాలు.. డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ, డిఫెన్స్ సైబర్ ఏజెన్సీలు త్రివిధ దళాల సేవా సంస్థలుగా ఏర్పడ్డాయి. ఇక్కడ త్రివిధ దళాలకు చెందిన అధికారులను నియమించారు. సాయుధ బలగాల స్పెషల్ ఆపరేషన్స్ విభాగం పనులు అధునాతన దశలో ఉన్నాయి.

click me!