డ్రగ్స్ కేసులో దోషిగా తేలిన అర్జున అవార్డు గ్రహీత

By ramya NFirst Published Feb 14, 2019, 11:13 AM IST
Highlights

డ్రగ్స్ సరఫరా కేసులో ఇంటర్నేషనల్ మాజీ రెజ్లర్, అర్జున అవార్డు గ్రహీత జగదీశ్ సింగ్ భోలాను మొహాలీ సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది.  

డ్రగ్స్ సరఫరా కేసులో ఇంటర్నేషనల్ మాజీ రెజ్లర్, అర్జున అవార్డు గ్రహీత జగదీశ్ సింగ్ భోలాను మొహాలీ సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది.  సుమారు రూ.6వేల కోట్ల డ్రగ్స్ రాకెట్ లో పంజాబ్ కు చెందిన డ్రగ్స్ కింగ్ భోలాను 2013లో అరెస్టు చేసింది. కాగా.. అప్పటి నుంచి ఈ కేసు కోర్టులో నడుస్తోంది.

సుదీర్ఘ విచారణ అనంతరం భోలాతోపాటు మరో 49మంది నిందితులను బుధవారం సీబీఐ కోర్టుముందు ప్రవేశపెట్టగా.. వీరిలో చాలా మంది సీబీఐ న్యాయస్థానం దోషిగా తేల్చింది.కాగా  భోలా ఆధ్వర్యంలో హిమాచల్ ప్రదేశ్‌లోని అక్రమ ఫ్యాక్టరీల ద్వారా సింథటిక్‌ డ్రగ్స్‌ను తయారుచేసి అంతర్జాతీయ మార్కెట్‌కు విక్రయిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా  కెనడా, ఉత్తర అమెరికా, యూరప్‌లోని పలు దేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారంటూ అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పంజాబ్‌ డీఎస్‌పీగా పనిచేస్తున్న భోలాను 2012లో పదవినుంచి తొలగించిన సంగతి తెలిసిందే.

click me!