మీటూ ఎఫెక్ట్...ఆ ఎన్నారై జర్నలిస్టుతో సంబంధం ఉంది...కానీ...: ఎంజే. అక్బర్

Published : Nov 02, 2018, 07:00 PM ISTUpdated : Nov 02, 2018, 07:06 PM IST
మీటూ ఎఫెక్ట్...ఆ ఎన్నారై జర్నలిస్టుతో సంబంధం ఉంది...కానీ...: ఎంజే. అక్బర్

సారాంశం

దేశవ్యాప్తంగా జరగుతున్న మీటూ ఉద్యమంలో మహిళలు తమపై జరిగిన అఘాయిత్యాల గురించి బహిరంగంగా ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువరు టాలీవడ్, బాలీవుడ్ హీరోలు, యాక్టర్లు, డైరెక్టర్లపై లైంగిక ఆరోపనలు వచ్చాయి. అలాగే చాలా మంది సెలబ్రిటీ  మహిళలు కూడా  ముందుకు వచ్చి తమపై జరిగిన లైంగికదాడి గురించి బైటపెడుతున్నారు. అయితే ఈ మీటూ ఉద్యమం వల్ల తమ మంత్రి పదవికి రాజీనామా చేసిన ఎంజే అక్బర్ పై ఓ ఎన్నారై మహిళ లైంగిక వేధింపుల ఆరోపణ చేయడం సంచలనంగా  మారింది. 

దేశవ్యాప్తంగా జరగుతున్న మీటూ ఉద్యమంలో మహిళలు తమపై జరిగిన అఘాయిత్యాల గురించి బహిరంగంగా ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువరు టాలీవడ్, బాలీవుడ్ హీరోలు, యాక్టర్లు, డైరెక్టర్లపై లైంగిక ఆరోపనలు వచ్చాయి. అలాగే చాలా మంది సెలబ్రిటీ  మహిళలు కూడా  ముందుకు వచ్చి తమపై జరిగిన లైంగిరదాడి గురించి బైటపెడుతున్నారు. అయితే ఈ మీటూ ఉద్యమం వల్ల తమ మంత్రి పదవికి రాజీనామా చేసిన ఎంజే అక్బర్ పై ఓ ఎన్నారై మహిళ లైంగిక వేధింపుల ఆరోపణ చేయడం సంచలనంగా  మారింది. 

అమెరికాలో నివాసముంటున్న మహిళా జర్నలిస్టు పల్లవి గొగొయ్ ఎంజే అక్బర్ తనను లైంగికంగా వేధించాడని వాషింగ్‌టన్ పోస్ట్ లో ఓ కథనంగా రాసింది. అతడి వద్ద పనిచేసే సమయంలో ఎలా వేధించేవాడో ఆ కథనంలో పల్లవి వివరించింది. 1990ల సమయంలో 22ఏళ్ల వయసులో అక్బర్ వద్ద చేరినట్లు పల్లవి తెలిపింది. అయితే తనపై కన్నేసిన అతడు లైంగికంగా వేధించేవాడని పల్లవి తాజాగా వెల్లడించింది. 

అయితే పల్లవి చేసిన ఆరోపణలను అక్బర్ తీవ్రంగా ఖండించారు. అయితే పల్లవితో తనకు సంబంధం ఉండేదని మాత్రం అక్బర్ ఒప్పుకున్నాడు. అయితే ఆమె తనతో ఇష్టపూర్వకంగానే సంబంధాన్ని కొనసాగించిందని తెలిపారు. తమ మధ్య సంబంధం కొన్ని నెలల పాటు సాగిందని...అయితే కొన్ని గొడవల కారణంగా ఆ బంధాన్ని తెంపుకున్నట్లు ఆయన వెల్లడించారు.

అయితే తాజాగా ఆమె ఎందుకు తనపై ఆరోపణలు చేస్తుందో అర్థం కావడం లేదని అక్బర్ అన్నారు.  ఆమె చేసేవన్నీ తప్పుడు ఆరోపణలే అని అన్నారు.తనపై ఆమె రాసిన ఆర్టికల్ చదివానని...అందువల్లే కొన్ని నిజాలు బైటపెట్టాలనే ఇప్పుడు స్పందించినట్లు అక్బర్ తెలిపారు.

మరిన్ని వార్తలు

నా ఒంటిమీద డ్రస్ తేసేసి రేప్ చేశాడు... ఎంజే అక్బర్ పై మరో జర్నలిస్ట్

పల్లవి వల్లే మా కుటుంబంలో అశాంతి: ఎంజె అక్బర్ భార్య

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు