BJP: పాక్ లో కంటే భారత్ లోనే ముస్లింలకు సేఫ్ : బిజెపి ప్రధాన కార్యదర్శి

Published : Apr 06, 2022, 04:47 AM ISTUpdated : Apr 06, 2022, 04:49 AM IST
 BJP: పాక్ లో కంటే భారత్ లోనే ముస్లింలకు సేఫ్ : బిజెపి ప్రధాన కార్యదర్శి

సారాంశం

BJP: పాకిస్తాన్‌లోని ముస్లీంల కంటే.. భారతదేశంలోని ముస్లింలు అత్యంత సురక్షితంగా ఉన్నారని, ప్రధాని మోడీ పాల‌న‌లో వారి అభివృద్ధి కోసం అనేక కార్య‌క్ర‌మాల‌ను చేపట్టార‌ని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే అన్నారు. దేశవ్యాప్తంగా ముస్లింల భద్రత కోసం.. ప్ర‌భుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటామని బిజెపి నాయకుడు చెప్పారు.  

BJP: భారతదేశంలోని ముస్లింలు పాకిస్తాన్‌లో కంటే సురక్షితంగా ఉన్నారని, బిజెపి పాలనలో వారు మ‌రింత‌త‌ సురక్షితంగా ఉన్నారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే అన్నారు. ముస్లింల భద్రత కోసం.. బీజేపీ అనేక చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని ఆయన తెలిపారు.  రెండు రోజుల కాశ్మీర్ పర్యటనలో ఉన్న తావ్డే .. మంగ‌ళ‌వారం నాడు కాశ్మీర్ యూనిట్‌కు చెందిన బిజెపి నాయకులతో సమావేశమయ్యారు. సెంట్రల్ కాశ్మీర్‌లోని గందర్‌బాల్‌లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కూడా మాట్లాడారు.

భార‌త దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ‌మనీ, మ‌న దేశంలో విభిన్న మ‌తాల‌కు చెందిన‌ 125 కోట్ల జ‌నాభా.. ఓ వ‌సుదైక కుటుంబంలా నివసిస్తోంద‌ని అన్నారు. ఇందు కోసం  ప్ర‌ధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని, కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ నుంచి గుజరాత్‌ వరకు అన్ని రాష్ట్రాల్లో ఒకే తరహాలో అభివృద్ధి జ‌రిగేలా బీజేపీ ప్ర‌భుత్వం అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టిద‌ని తెలిపారు. 
 
ప్ర‌ధాని మోడీ విశ్రాంతి లేకుండా.. నిత్యం సామాన్య ప్రజల కోసం పని చేస్తాడని, అనుక్ష‌ణం దేశాభివృద్ది కోసం కృషి చేసే నాయ‌కుడ‌ని అన్నారు. 60 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ భారతదేశాన్ని నాశనం చేసింద‌ని విరుచుకుపడ్డారు. బిజెపి పాలనలో ప్రతి ముస్లిం సురక్షితంగా ఉన్నారని, దేశ‌వ్యాప్తంగా ముస్లింల భద్రత కోసం ప్ర‌ధాని మోడీ  చర్యలు తీసుకుంటారని ఆయన అన్నారు. పాకిస్థాన్ లో నివ‌సిస్తున్న ముస్లీంల కంటే.. భారతదేశంలో ఉన్న‌ ముస్లింలు సురక్షితంగా ఉన్నారని ఆయన అన్నారు.

గత ప్రభుత్వాలు ముస్లీం స‌మ‌స్య‌ల‌ను త‌ట్టించుకోలేద‌ని ఎండగట్టారు. ఒకప్పుడు కాశ్మీర్ పెద్ద ఎత్తున అవినీతి, అరాచకాలు, అక్ర‌మ భూముల లావాదేవీలు, ఉద్యోగాలు ఇవ్వడంలో అక్రమాలకు పేరుగాంచిందని అన్నారు. ఆర్టిక‌ల్  370 ర‌ద్దు అనంత‌రం.. జ‌మ్మూ కాశ్మీరీయుల జీవితాల్లో నూత‌న వెలుగులు వ‌చ్చాయ‌నీ, కాశ్మీర్‌లోని ప్రతి ఇల్లు కమలం వికసించే సమయం చాలా ద‌గ్గ‌ర‌లోనే ఉంద‌నీ, దేశ‌వ్యాప్తంగా అత్యంత ప్ర‌జాధార‌ణ పొందిన ఏకైక పార్టీ బిజెపి అని బిజెపి నాయకుడు అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?