Owaisi: 'మాంసం అప‌విత్రం కాదు.. ఆహారం మాత్రమే': మాంసం విక్రయాలపై నిషేధాన్ని ఖండించిన ఒవైసీ

Published : Apr 06, 2022, 02:23 AM ISTUpdated : Apr 06, 2022, 02:39 AM IST
 Owaisi: 'మాంసం అప‌విత్రం కాదు..  ఆహారం మాత్రమే': మాంసం విక్రయాలపై నిషేధాన్ని ఖండించిన ఒవైసీ

సారాంశం

Owaisi: దేవీ నవరాత్రుల సందర్భంగా ద‌క్షిణ ఢిల్లీలో మాంసం విక్రయాల నిషేధించ‌డాన్ని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. మాంసం అశుద్ధం లేదా అప‌విత్రం కాదని, ఉల్లి, వెల్లుల్లి ఎలాగో మాంసం కూడా కేవలం ఆహారమేనని అన్నారు. మాంసం కొనుగోలు చేయాలా వద్దా అనేది వంద శాతం ప్రజల ఇష్టాఇష్టాలపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.  

Owaisi: దేవీ నవరాత్రుల్లో (Navratri)  దక్షిణ ఢిల్లీలో మాంసం విక్రయాలపై నిషేధం విధించడాన్ని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యతిరేకించారు. మాంసం అశుద్ధం లేదా అప‌విత్ర‌మైన‌ది కాదని, ఉల్లి, వెల్లుల్లి ఎలాగో మాంసం కూడా కేవలం ఆహారమేనని అన్నారు. మాంసం కొనుగోలు చేయాలా వద్దా అనేది వంద శాతం ప్రజల ఇష్టాఇష్టాలపైనే ఆధారపడి ఉంటుందని, వద్దనుకుంటే కొనుగోలు చేయకపోతే సరిపోతుందని ఒవైసీ పేర్కొన్నారు. 

బ‌డా పారిశ్రామికవేత్తల వ్యాపారం సులభత‌రం చేయాలని ప్ర‌ధాని భావిస్తోన్నార‌ని విరుచుకుపడ్డారు. సులభతర వాణిజ్యం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) అనేది పారిశ్రామికవేత్తలకే పరిమితం చేయాలని మోదీ కోరుకుంటున్నారని అన్నారు. సైద్ధాంతిక పరమైన సహచరుల కోసమే దీనిని వర్తింప చేస్తున్నారని ఆరోపించారు. మాంసం వ్యాపారులు ఆదాయం కోల్ప‌తే.. ఆ న‌ష్ట‌ప‌రిహ‌రాన్ని ఎవరు భర్తీ చేస్తారు?  విమర్శించారు. మాంసం అప‌విత్రం కాదనీ, ఇది వెల్లుల్లి లేదా ఉల్లి వంటి ఆహారం మాత్రమేన‌నీ,  99% కాదు. 100% ప్రజలకు మాంసం కొనాలా వద్దా అనే ఛాయెస్ ఉంటుంది. వద్దనుకుంటే కొనరు'' అని ఒవైసీ తెలిపారు

దీనికి ముందు, ఢిల్లీలోని 99% కుటుంబాలు నవరాత్రులలో వెల్లుల్లి, ఉల్లిపాయలను కూడా తినరని దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ముఖేష్ సూర్యన్ వ్యాఖ్యానించారు. త్వరలోనే మాంసం దుకాణాల మూసివేతకు అధికారిక ఉత్తర్వులు ఇస్తామని, మంగళవారం నుంచి దుకాణాలు తెరవడాన్ని అనుమతించమని అన్నారు. 

ఈ మేర‌కు  SDMC కమీషనర్ జ్ఞానేష్ భారతికి  సూర్యన్ ఓ లేఖ రాశారు. నవరాత్రి (Navratri) సందర్భంగా రోజువారీ దుర్గామాత పూజలు చేసేందుకు వెళ్లే వారు మాంసం దుకాణాలు దాటి వెళ్లాలన్నా, ఆ వాసన భరించాలన్నా ఇబ్బందికరంగా ఉంటుందని, భక్తుల మతపరమైన నమ్మకాలు దెబ్బతింటాయని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. సూర్యన్ తన నిర్ణయానికి గల కారణాలను వివరిస్తూ, దుర్గామాత భక్తులు తొమ్మిది రోజుల పాటు కఠినమైన శాఖాహార ఆహారంతో పాటు మాంసాహార పదార్థాలు, మద్యం, కొన్ని సుగంధ ద్రవ్యాల వాడకానికి దూరంగా ఉంటారని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

EPFO : ఈపీఎఫ్‌వో కొత్త రూల్.. ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పీఎఫ్ డబ్బులు
IAF Recruitment : కేవలం ఇంటర్ అర్హతతో... ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల భర్తీ