Arvind Kejriwal: "ప్రాథమిక హ‌క్కుల ఉల్లంఘ‌నే".. కేజ్రీవాల్ ఇంటిపై దాడి .. బెయిల్ నిరాక‌రించిన ఢిల్లీ కోర్టు

Published : Apr 06, 2022, 12:03 AM IST
Arvind Kejriwal: "ప్రాథమిక హ‌క్కుల ఉల్లంఘ‌నే"..  కేజ్రీవాల్ ఇంటిపై దాడి .. బెయిల్ నిరాక‌రించిన ఢిల్లీ కోర్టు

సారాంశం

Arvind Kejriwal: గత నెల 30న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) నేతలు జరిపిన దాడిని ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. శాంతియుతంగా నిరసన తెలియ జేసేందుకు కల్పించిన ప్రాథమిక హక్కును నిందితులు ఉల్లంఘించారని వ్యాఖ్యానించింది. ఈ ఘటనలో ప్రధాన నిందితులైన ఎనిమిది మందికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.  

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై భారతీయ జనతా యువమోర్చా (BYJM) కార్యకర్తలు జరిపిన దాడిని ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ ఘటనలో ప్రధాన నిందితులైన ఎనిమిది మందికి బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించింది. ఒక వ్యక్తి సామాజిక క్రమానికి ప్రమాదంగా మారినప్పుడు.. అత‌ని స్వేచ్ఛను అడ్డుకోవచ్చని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. 

గత నెల 30న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై భారతీయ జనతా యువమోర్చా (BYJM) కార్యకర్తలు దాడి చేశారు. సీఎం ఇంటి వ‌ద్ద ఉన్న భ‌ద్ర‌త సిబ్బందిని దాటి.. అక్క‌డ ఏర్పాటు చేసిన  బారికేడ్‌లను దూకి, నానా ర‌చ్చ చేశారు. ప‌లు వ‌స్తువుల‌ను ధ్వంసం చేశారు.  ఈ ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది భారతీయ జనతా యువమోర్చా (BYJM) కార్యకర్తల‌ను అరెస్టు చేశారు. వారినే కోర్టు ప్ర‌ధాన నిందితులుగా గుర్తించింది.

వారి బెయిలు విచారణ సందర్భంగా అడిషనల్ సెషన్స్ జడ్జి నవీన్ కుమార్ కశ్యప్ ధ‌ర్మాస‌నం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వారికి బెయిల్ ఇవ్వ‌డానికి కోర్టు నిరాకరించింది. శాంతి యుతంగా నిరసన తెలియజేసేందుకు కల్పించిన ప్రాథమిక హక్కును నిందితులు ఉల్లంఘించారని వ్యాఖ్యానించింది. ఆ నిబంధ‌న‌లు తెలిసి కూడా వారు.. ఈ దుర్చ‌ర్య‌కు పాల్పడ్డారని అభిప్రాయపడింది. 

ప్రతి పౌరుడు చట్టానికి లోబడి, బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో ఉండాలని సూచించింది. ప్రతి పార్టీకి నిరసన తెలియజేసే హక్కు ఉంటుందని, అయితే అది ఆంక్షలకు లోబడే ఉండాలని కోర్టు చెప్పింది. సమాజం ఆమోదించని. క్రమరాహిత్యానికి దారితీసే విధంగా.. క్రమరహితంగా ప్రవర్తించినప్పుడు, చట్టపరమైన పరిణామాలు అనుసరించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. 
 
రాజకీయ పార్టీ ద్వారా సమావేశమై నిరసన తెలిపే హక్కు ఉంద‌నీ, అది ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని కోర్టు అంగీకరించింది, అయితే.. అటువంటి హక్కు కొన్ని పరిమితులకు లోబడి ఉంటుందనీ,  అది అనియంత్రితమైనది కాదని కోర్టు పేర్కొంది. ప్రస్తుత సందర్భంలో.. వారు నిరసన వ్యక్తం చేయడం, అప్పటికప్పుడు తమ నిరసనను ముగించడం సాధారణ కేసు కాదు... నిరసనకారులు, వారి నాయకులతో, ప్రస్తుత దరఖాస్తుదారులతో సహా, వారు చేయగలరు. ఒక నిర్దిష్ట ప్రదేశంలో నిరసన చేయాల‌ని, కానీ, వారు దానిని పాటించలేదని, ఇత‌ర స్వేచ్చ‌ను భంగం క‌లిగించార‌ని కోర్టు పేర్కొంది.

నిందితుల తరపున వాదించిన సీనియర్ న్యాయవాది కీర్తి ఉప్పల్.. ఈ కేసులో నేరాలకు ఏడేళ్ల లోపు జైలు శిక్ష పడుతుందని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ.. పోలీసులు ఎలాంటి నోటీసులు అందించలేదని కోర్టుకు తెలిపారు. అక్రమంగా నిందితులను అరెస్టు చేశారని ఆరోపించారు.  ఇక్క‌డ ఎవరినీ బాధపెట్టే ఉద్దేశ్యం లేదని, రాజ్యాంగం ప్రకారం.. ప్రతి పౌరుడు త‌న‌కు న‌చ్చిన‌ రాజకీయ పార్టీ భావ‌జాలాన్ని వ్య‌క్త‌ప‌రిచే అవ‌కాశముంద‌ని వాదించారు.

ఉప్పల్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం సరైన మార్గదర్శకాలు పాటించని పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆర్డర్ కాపీని సంబంధిత డీసీపీకి పంపింది. ప్రతి పౌరుడు చట్టానికి లోబడి, బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో ఉండాలని సూచించింది. ప్రతి పార్టీకి నిరసన తెలియజేసే హక్కు ఉంటుందని, అయితే అది ఆంక్షలకు లోబడే ఉండాలని కోర్టు చెప్పింది. 

PREV
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu