నాకు పదెకరాల భూమి ఉన్నా పిల్లనివ్వడం లేదు.. అమ్మాయిని వెతకండి అంటూ ఎమ్మెల్యేకు యువకుడి ఫోన్ కాల్..

By team teluguFirst Published Jan 11, 2023, 10:47 AM IST
Highlights

తనకు పది ఎకరాల భూమి ఉందని, అయినా పెళ్లి కోసం పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఓ యువకుడు ఎమ్మెల్యేతో ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు ఫోన్ కాల్ చేసి అమ్మాయిని వెతకాలి అని అభ్యర్థించాడు. 

దేశానికి అన్నం పెట్టే అన్నదాతకు పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. పట్టణాల్లో నివసిస్తూ ఏదో ఒక పని చేసుకునే యువకులకే కూతుర్లను ఇవ్వడానికి తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితిలో ప్రస్తుతం నెలకొన్నాయి. మహారాష్ట్రలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. తాజాగా వెలుగులోకి వస్తున్న ఘటనలు దీనిని రుజువు చేస్తున్నాయి. ఇటీవల కొందరు యువకులు తమకు వధువు కావాలంటూ గుర్రాలపై ఎక్కి ఓ జిల్లా కలెక్టర్ ఆఫీసుకు వెళ్లిన వింత ఘటన చోటు చేసుకుంది. 

కట్టెలు సేకరించేందుకు వెళ్లిన 12 ఏళ్ల బాలికపై పులి దాడి.. మెడ, చేతులకు తీవ్ర గాయాలు

తనకు అమ్మాయిని చూడాలని ఓ యువకుడు తన నియోజకవర్గ ఎమ్మెల్యేకు ఏకంగా కాల్ చేసి చెప్పాడు. వీరి మధ్య ఫన్నీగా సాగిన సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శివసేన ఉద్ధవ్ ఠాక్రే  వర్గానికి చెందిన కన్నడ ఎమ్మెల్యే ఉదయ్‌సింగ్ రాజ్‌పుత్ కు ఖుల్తాబాద్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు కాల్ చేశాడు.

ఘోరం.. బైక్ పై కూలిన మెట్రో పిల్లర్.. తల్లీ కుమారుడి మృతి..

తాను పెళ్లి చేసుకుంటానని, దాని కోసం ఓ అమ్మాయిని చూడాలని కోరాడు. వీరి మధ్య సాగిన సంభాషణలో ఆ యువకుడు తన పూర్తి వివరాలను వెల్లడించారు. ‘‘నాకు 8-9 ఎకరాల భూమి ఉంది. కానీ నాకు అమ్మాయిని (పెళ్లి కోసం) ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరు. కన్నాడ్ ఏరియాలో ఆడపిల్లలున్నారు. అక్కడ నా కోసం ఒక అమ్మాయిని చూడండి” అని ఆ యువకుడు ఎమ్మెల్యేను అభ్యర్థించాడు.

భోపాల్ గ్యాస్ దుర్ఘటన: 30 ఏళ్ల తర్వాత మళ్లీ కేసు తెరవడమా?

యువకుడి అభ్యర్థనకు ఆ ఎమ్మెల్యే కరిగిపోయాడు. తప్పకుండా అమ్మాయిని చూస్తానని, పూర్తి బయోడేటా పంపించాలని సూచించాడు. వివాహం చేసే బాధ్యత తనది అని హామీ ఇచ్చాడు. ఈ సంభాషణపై ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. తనకు కాల్ చేసిన యువకుడి ఆందోళన గ్రామాల్లో వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతుందని చెప్పారు. “ పరిస్థితి అంత బాగా లేదు. ఒక గ్రామంలో 2,000 మంది నివాసితులు ఉంటే.. అక్కడ దాదాపు 100-150 మంది పెళ్లికాని యువకులు కనిపిస్తున్నారు. యువకులకు 100 ఎకరాల భూమి ఉన్నా పెళ్లికి అమ్మాయి దొరకడం కష్టంగానే ఉంది’’ అని ఎమ్మెల్యే ఉదయ్‌సింగ్ రాజ్‌పుత్ వార్తా సంస్థ ‘పీటీఐ’కి మంగళవారం తెలిపారు.

అడవి ఏనుగుల బీభత్సం.. గత 8 ఏళ్లలో 3,930 మృత్యువాత.. అగ్రస్థానంలో ఒడిశా.. ఆర్టీఐ నివేదికలో పలు షాకింగ్ నిజాలు

పట్టణ ప్రాంతాల్లో నివసించే కుటుంబాల్లోని యువకులకే తమ కూతుళ్లను ఇచ్చి పెళ్లి చేయాలని చాలా మంది తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారని ఆయన అన్నారు. తనకు  చాలా కాల్స్ ఇలాంటి వస్తున్నాయని తెలిపారు. కాగా.. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019-21) ప్రకారం.. మహారాష్ట్రలో లింగ నిష్పత్తి మధ్య తేడా అధికంగా ఉంది. ప్రతీ 1,000 మంది పురుషులకు 920 మంది స్త్రీలే ఉన్నారు. 
 

click me!