ఆర్టికల్ 370 ర‌ద్దు చేసినా.. కాశ్మీర్ లో హ‌త్య‌లు ఎందుకు ఆగ‌డం లేదు - షనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా

Published : Oct 17, 2022, 03:40 PM IST
ఆర్టికల్ 370 ర‌ద్దు చేసినా.. కాశ్మీర్ లో హ‌త్య‌లు ఎందుకు ఆగ‌డం లేదు - షనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా

సారాంశం

కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసినా ఇంకా ఎందుకు హత్యలు ఆగడం లేదని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న హత్యలకు ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు.   

కేంద్ర ప్ర‌భుత్వం ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు చేసినా.. కాశ్మీర్ లో ఇంకా హ‌త్య‌లు ఎందుకు ఆగ‌డం లేద‌ని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అన్నారు. సోమ‌వారం ౠయ‌న మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. లోయలో ఇటీవల జరిగిన హత్యలలు, ముఖ్యంగా షోపియాన్‌లో కశ్మీర్ పండిట్‌పై గత శనివారం జరిగిన హత్యల విష‌యాన్ని మీడియా ప్ర‌స్తావించిన‌ప్పుడు ‘‘న్యాయం జరిగే వరకు ఇది ఎప్పటికీ ఆగదు.’’ అని అన్నారు.

ఆ రేప్ కేసులో నిందితుడు బాధితురాలిని పెళ్లి చేసుకోవాలి.. కానీ, ఓ కండీషన్..: బాంబే హైకోర్టు తీర్పు

గతంలో జరిగిన హత్యలకు ఆర్టికల్ 370 కారణమని బీజేపీ ఆరోపించేదని, కానీ ఇప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదాను రద్దు చేసినా పరిస్థితి ఎందుకు మెరుగుపడలేదని ప్రశ్నించారు. ‘‘ పూర్తి న్యాయం జరిగే వరకు ఇది ఎప్పటికీ ఆగదు. ఆర్టికల్ 370 వల్ల ఇలాంటి హత్యలు జరుగుతున్నాయని గతంలో వారు చెప్పారు, కానీ ఇప్పుడు దానిని రద్దు చేశారు. అయినా అలాంటి హత్యలు ఎందుకు ఆగలేదు? దీనికి బాధ్యులు ఎవరు? ’’ అని ఆయన ప్రశ్నించారు.

గుజరాత్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చేంత వ‌ర‌కు మ‌నీష్ సిసోడియాను జైల్లోనే ఉంచుతారు - కేజ్రీవాల్

“ఆర్టికల్ 370ని రద్దు చేసి (ఆగస్టు 2019లో) నాలుగు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ ప్రజలు చనిపోతున్నారు. ఆర్టికల్ 370 గతంలో హత్యలకు కారణమైతే, ఈ అమాయక పండిట్ పురాణ్ కృష్ణ్ భట్ ఎందుకు హత్యకు గురయ్యాడు. దానికి ఏదో కారణం ఉండాలి. ఆర్టికల్ 370 హత్యలకు బాధ్యత వహించదు, ఎందుకంటే ఉగ్రవాదం బయటి నుండి స్పాన్సర్ అవుతోంది. ” అని ఆయన అన్నారు. ఈరోజు రియాసిలోని కత్రాలో జరిగిన పార్టీ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

కాగా.. శనివారం జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని చౌదరి గుండ్ ప్రాంతంలో పురాణ్ క్రిషన్ భట్ అనే కాశ్మీరీ పండిట్‌ను ఆయ‌న ఇంటి స‌మీపంలో ఉగ్రవాదులు కాల్చి చంపారు. అదే ఏరియాలోని తమ యాపిల్ తోటకు వెళ్లుతుండగా వెనుక వైపు నుంచి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇందులో కశ్మీరి పండిట్ పురన్ క్రిషన్ భట్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను వెంటనే జిల్లా హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానీ, అప్పటికే పురన్ క్రిషన్ భట్ మరణించినట్టు వైద్యులు తెలిపారు.

వైఫ్ స్వాప్.. భార్యను మరొకరితో సెక్స్ చేయాలని ఒత్తిడి.. తిరస్కరించడంతో దాడి.. ‘నీకు కల్చర్ తెలీదు’

ఈ ఘ‌ట‌న‌పై డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుజిత్ కుమార్ మాట్లాడుతూ.. కాశ్మీర్ ఫ్రీడమ్ ఫైటర్ (కెఎఫ్‌ఎఫ్) గ్రూప్, టెర్రరిస్ట్ గ్రూప్ ప్రాక్సీ పేరు ఈ దాడికి బాధ్యత వహించింద‌ని చెప్పారు.  దీనిని కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు. టెర్రరిస్టులు ఓ పౌరుడిపై కాల్పులు జరిపారని, షోపియాన్ జిల్లా చౌదరి గుండ్ ఏరియాలోని వారి తోటకు వెళుతుండగా ఈ కాల్పులు జరిపారని పేర్కొన్నారు. ఆయనను వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారని, కానీ, గాయాలతో మరణించాడని పేర్కొన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Indian Army Romeo Force Destroys: గడ్డ కట్టే మంచులో మన ఇండియన్ ఆర్మీ| Asianet News Telugu
Tourists Enjoy New Year’s First Snow in Chamba: మంచు కొండల్లో న్యూఇయర్ వేడుకలు | Asianet News Telugu