రైలు ప్రయాణికులకు శుభవార్త.. ఉచితంగా సినిమాలు

Published : Feb 14, 2019, 01:46 PM IST
రైలు ప్రయాణికులకు శుభవార్త.. ఉచితంగా సినిమాలు

సారాంశం

కాచిగూడ- కేఎస్ఆర్ బెంగళూరు ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు శుభవార్త. 

కాచిగూడ- కేఎస్ఆర్ బెంగళూరు ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ డిజిటల్  ఇండియా మిషన్ కార్యక్రమంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే కొత్తగా మేజిక్ బాక్స్ ని ప్రవేశపెట్టింది.

ఇందులో భాగంగా కాచిగూడ- కేఎస్ఆర్ బెంగళూరు ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణించే వారికి ఉచితంగా వైఫై సదుపాయం కల్పిస్తున్నారు. ఈ ఉచిత వైఫైతో రైలు ప్రయాణికులు సినిమాలు ఉచితంగా చూడవచ్చని చెప్పారు.

శతాబ్ది, ముంబయి రాజధాని ఎక్స్ ప్రెస్, లక్నో ఎక్స్ ప్రెస్లలో లాగా వైఫ్ ఎన్ ఫోటెయిన్ మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేశామని.. దాని సహాయంతో ప్రయాణికులు వ్యక్తిగత డివైజ్ లలో ఉచితంగా నచ్చిన సినిమాలను చూడవచ్చని రైల్వేశాఖ ప్రకటించింది.

ఇటీవల కాచిగూడ-కేఎస్ఆర్ బెంగళూరు ఎక్స్ ప్రెస్ లోని ఐదు ఏసీ బోగీల్లో ప్రయోగాత్మకంగా ఈ ఉచిత వైఫై విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే.. సినిమాలు చూడటానికి మాత్రమే అవకాశం ఉందని.. డౌన్ లోడ్ చేసుకోవడానికి మాత్రం వీలులేదని చెబుతున్నారు. అదేవిధంగా అశ్లీల, అభ్యంతకర కంటెన్లను చూడకుండా.. వైఫైని దుర్వినియోగం చేయకుండా ఉండేలా అధికారలు చర్యలు తీసుకుంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

38 మందికి మరణ శిక్ష గుజరాత్ హై కోర్ట్ సంచలన తీర్పు | Historic Verdict in 2008 Ahmedabad Incident
ఇండోనేషియాలో ప్రంబనన్ ఆలయందర్శించిన మోదీ పవర్ ఫుల్ స్పీచ్ | PM Narendra Modi Prambanan Temple Visit