రాఫెల్‌పై మరోసారి రాహుల్ ఆరోపణలు

By narsimha lodeFirst Published Feb 13, 2019, 5:18 PM IST
Highlights

అనిల్ అంబానీకి  దోచిపెట్టేందుకే మోడీ  రాఫెల్ ఒప్పందం కుదుర్చుకొన్నారని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు.
 

న్యూఢిల్లీ: అనిల్ అంబానీకి  దోచిపెట్టేందుకే మోడీ  రాఫెల్ ఒప్పందం కుదుర్చుకొన్నారని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు.

బుధవారం నాడు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అసలు ఒప్పందానికి, మోడీ కుదుర్చుకొన్న ఒప్పందానికి మధ్య చాలా తేడా ఉందన్నారు. కాగ్ రిపోర్టులో లెక్కలన్నీ తారుమారయ్యాయని  రాహుల్ ఆరోపించారు. కాగ్ రిపోర్ట్‌పై రాహుల్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

రక్షణశాఖ కార్యదర్శి నోట్‌ను కాగ్ రిపోర్ట్‌లో ఎందుకు ప్రస్తావించలేదో చెప్పాలని రాహుల్ ప్రశ్నించారు. జేపీసీ విచారణకు బీజేపీ ఎందుకు భయపడుతోందో  ప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. జేపీసీ విచారణకు బీజేపీ ఎందుకు వెనుకడుగు వేస్తోందో చెప్పాలన్నారు. రాఫెల్ కొనుగోళ్లలో అవకతవకలు చోటు చేసుకోకపోతే ఎందుకు జేపీసీకి నిరాకరిస్తున్నారని రాహుల్ ప్రశ్నించారు. 
 

click me!