యూపీ మదర్సాల్లో ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులు తప్పనిసరి.. నేడు సమావేశం

By Mahesh KFirst Published Dec 20, 2022, 2:30 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్ మదర్సాల్లో ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులను ఇక పై నుంచి తప్పనిసరి చేయనున్నారు. యూపీబీఎంఈ చైర్మన్ డాక్టర్ ఇఫ్తిఖర్ అహ్మద్ జావేద్ సారథ్యంలో జరగనున్న నేటి భేటీలో ఈ నిర్ణయం తీసుకుంటారు.
 

లక్నో: ఉత్తరప్రదేశ్ మదర్సాలకు సంబంధించి మరో కీలక నిర్ణయం ఇవాళ తీసుకోబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మదర్సాల్లో ఇకపై ఇంగ్లీష్, మ్యాథమేటిక్స్, సైన్స్‌ సబ్జెక్టులను తప్పనిసరిగా బోధించాలని నిర్ణయిస్తున్నారు. ఈ రోజు నిర్వమించే మద్రాసా ఎడ్యుకేషన్ యూపీ బోర్డు ఈ రోజు సమావేశం కానుంది. ఈ భేటీలోనే పైన పేర్కొన్న కీలక నిర్ణయాలను తీసుకోనుంది.

మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు (యూపీబీఎంఈ) చైర్మన్ డాక్టర్ ఇఫ్తిఖర్ అహ్మద్ జావేద్ సారథ్యంలో ఈ భేటీ జరుగుతుంది. యూపీ మౌలానా, ఇతర అధికారులు, టీచర్లు కూడా సమావేశంలో పాల్గొంటారు. 

ప్రస్తుతం మదర్సాల్లో ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ అంశాలను బోధిస్తున్నారు. కానీ, ఇవి ఆప్షనల్‌గా ఉన్నాయి. అయితే, తాజాగా వీటిని తప్పనిసరి చేసి, విద్యార్థులు అందరికీ ఈ సబ్జెక్టులను తప్పనిసరి అంశాలుగా నిర్ణయం తీసుకుంటున్నారు. వీటితోపాటు అధికారిక ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలనూ మదర్సాల్లో బోధిస్తున్నారు.

Also Read: ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో భగవద్గీత ప్రస్తావన.. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం

ఈ మూడు సబ్జెక్టులను బోధించడానికి వేరుగా టీచర్లను నియమించనున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో 2017 ఆగస్టు 15న అంటే స్వాతంత్ర్య దినోత్సవాన తొలిసారి మదర్సా బోర్డు జాతీయ జెండా ఎగరేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. మళ్లీ ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో ప్రతి మదర్సా జాతీయ గీతాన్ని ఆలపించడాన్ని ప్రారంభించింది. మదర్సాల్లో తరగతులు ప్రారంభించడానికి ముందు విద్యార్థులు, ఉపాధ్యాయులు తప్పకుండా జాతీయ గీతాన్ని ఆలపించాలని యూపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను ఇవాళ్టి నుంచే అంటే మే 12వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. 

యూపీ మైనార్టీ శాఖ మంత్రి దానిష్ ఆజాద్ అన్సారీ ఈ ఆదేశాలను పాస్ చేశారు. మార్చి 24న నిర్వహించిన యూపీ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డులో ఈ నిర్ణయం తీసుకున్నారు. మే 12వ తేదీ నుంచి ప్రతి మదర్సాల్లో జాతీయ గీతాన్ని ఆలపించాలనే ఆదేశాలు మే 9వ తేదీ జారీ అయ్యాయి. ఈ ఆదేశాల ప్రకారం, మదర్సాలు ఇది వరకు ఆలపించిన మత పరమైన పాటలతోపాటు జాతీయ గీతాన్ని తప్పకుండా పాడాలి.  

రంజాన్ మాసం కారణంగా మదర్సాలు మార్చి 30వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు మూసేశారు. మళ్లీ ఇవాళే అంటే మే 12వ తేదీనే మదర్సాలు తెరుచుకున్నాయి. ఈ ఆదేశాలను ఇవాళ్టి నుంచే అమలు చేశారు. ఈ ఆదేశాలు అన్ని గుర్తింపు పొందిన ఎయిడెడ్, నాన్ ఎయిడెడ్ మదర్సాలకు వర్తిస్తుంది. యూపీ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు చైర్‌పర్సన్ ఇఫ్తికార్ అహ్మద్ జావేద్ సారథ్యంలో మార్చి 24వ తేదీన జరిగిన సమావేశంలో జాతీయ గీత ఆలాపనపై నిర్ణయాలు తీసుకన్నారు. 

click me!