కవితకు షాకిచ్చిన ఈడీ.. మా వాదనలు వినకుండా ఆదేశాలివ్వొద్దు , సుప్రీంకోర్టులో కేవియెట్ పిటిషన్

Siva Kodati |  
Published : Mar 18, 2023, 08:19 PM ISTUpdated : Mar 18, 2023, 08:37 PM IST
కవితకు షాకిచ్చిన ఈడీ.. మా వాదనలు వినకుండా ఆదేశాలివ్వొద్దు , సుప్రీంకోర్టులో కేవియెట్ పిటిషన్

సారాంశం

ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది. కవిత పిటిషన్‌కు సంబంధించి తమ వాదన వినకుండా ఎలాంటి ముందస్తు నిర్ణయాలు ప్రకటించొద్దని ఈడీ సుప్రీంను కోరింది.

ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కేవియెట్ పిటిషన్ దాఖలు చేసింది. కవిత పిటిషన్‌కు సంబంధించి తమ వాదన వినకుండా ఎలాంటి ముందస్తు నిర్ణయాలు ప్రకటించొద్దని ఈడీ సుప్రీంను కోరింది. దీనిపై కవిత ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో  గురువారం  విచారణకు  హాజరు కాలేనని  చివరి నిమిషంలో  ఈడీకి  కవిత  సమాచారం పంపడంలో  వ్యూహత్మకంగా  వ్యవహరించిందనే  అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. మహిళలను  విచారించే  సమయంలో  తన హక్కులను చూపి  కవిత  విచారణకు గైర్హాజరయ్యారు. అయితే దీనిపై స్పందించిన ఈడీ ఈ నెల 20వ తేదీన విచారణకు రావాలని కవితకు నోటీసులు జారీ చేసింది. తొలుత ఈ నెల 11న కవిత ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆ సమయంలో 9 గంటలకు పైగా కవితను విచారించిన ఈడీ అధికారులు.. ఈ నెల 16న మరోసారి విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు జారీచేశారు. ఈ నేపథ్యంలోనే కవిత గురువారం ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే ఆమె అనూహ్యంగా విచారణకు గైర్హాజరు అయ్యారు. 

Also REad: సుప్రీంకోర్టులో ముందస్తు పిటిషన్లు దాఖలు చేయలేదు: కవిత

ఈ క్రమంలోనే కవిత ఈడీ అధికారులకు లేఖ రాశారు. అందులో పలు అంశాలను ప్రస్తావించారు. ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను మార్చి 24కి సుప్రీంకోర్టు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కూడా కవిత లేఖలో ప్రస్తావించారు. తాను వ్యక్తిగతంగా రావాలని సమన్లలోని ఎక్కడ పేర్కొనలేదని.. తన ప్రతినిధిగా భరత్‌ను ఈడీ కార్యాలయానికి పంపుతున్నానని చెప్పారు. సమన్లలో అడిగిన వివరాలను కూడా భరత్ ద్వారా పంపుతున్నానని చెప్పారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఏమిటీ..! కేవలం పశువుల పేడతో రూ.500 కోట్ల లాభమా..!!
Sabarimala Makarajyothi: మకర జ్యోతి దర్శనానికి శబరిమలకు పోటెత్తిన భక్తులు | Asianet News Telugu