కాంగ్రెస్ లేకుంటే మమతా బెనర్జీ లేనేలేదు.. 'బిగ్ బాస్' వ్యాఖ్యలపై అధిర్ రంజన్ ఫైర్

Published : Mar 18, 2023, 07:08 PM IST
కాంగ్రెస్ లేకుంటే మమతా బెనర్జీ లేనేలేదు.. 'బిగ్ బాస్' వ్యాఖ్యలపై అధిర్ రంజన్ ఫైర్

సారాంశం

మమతా బెనర్జీని కాంగ్రెస్సే తయారు చేసిందని కాంగ్రెస్ సీనియర్ లీడర్ అధిర్ రంజన్ చౌదరి అన్నారు. చరిత్ర మరిచిన ద్రోహి మమతా బెనర్జీ అని ఫైర్ అయ్యారు. విపక్షాలకు బిగ్ బాస్ వైఖరిని కాంగ్రెస్ విడనాడాలని టీఎంసీ చేసిన వ్యాఖ్యలపై చౌదరి తీవ్రంగా స్పందించారు.  

కోల్‌కతా: కాంగ్రెస్ తనను తాను బిగ్ బాస్‌లా భావించడం మానుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ శనివారం పేర్కొంది. ఈ విమర్శలపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదురి రియాక్ట్ అయ్యారు. మమతా బెనర్జీని కాంగ్రెస్ తయారు చేసిందని అన్నారు. మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్ దొంగల పార్టీగా మారిందని ఆరోపించారు. ఆమె సృష్టి విషపూరితమైందని పేర్కొన్నారు. మమతా బెనర్జీని తయారు చేసిందే కాంగ్రెస్ పార్టీ.. అలాంటి మమతా బెనర్జీ అన్ని మాటలు అంటుందా? అంటూ అధిర్ రంజన్ చౌదరి విమర్శించారు. చరిత్రను విస్మరించరాదని అన్నారు.

అంతేకాదు, మమతా బెనర్జీని ఓ ద్రోహి అని కూడా అధిర్ రంజన్ చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ దయ చూపినందుకే మమతా బెనర్జీ మంత్రి అయ్యారని వివరించారు. చరిత్రను విస్మరించినవారే ద్రోహులు అవుతారని, మమతా బెనర్జీ కూడా ఒక ద్రోహి అని తెలిపారు. 

Also Read: అల్లు అర్జున్ నన్ను బ్లాక్ చేశాడంటూ నటి ఆరోపణ.. వెంటనే స్పందించిన బన్నీ.. ఇంతకీ ఏం జరిగింది?

తృణమూల్ కాంగ్రెస్ అంతర్గత సమావేశం తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ వైఖరిపై స్పష్టత ఇచ్చింది. జనరల్ ఎలక్షన్స్‌లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేస్తుందని, అంతలోపు భావ సారూప్య పార్టీలతో చర్చలు జరుపుతామని వివరించారు. కాంగ్రెస్‌తో సంబంధాలను ఈ సందర్భంగా ప్రస్తావించగా.. విపక్షాలకు బిగ్ బాస్‌ అనే ఆలోచనా ధోరణిని కాంగ్రెస్ విడిచి పెట్టాలని టీఎంసీ నేత సుదీప్ బందోపాధ్యాయ్ అన్నారు. అలాగైతే.. రాహుల్ గాంధీని విపక్ష నేతగా చూపి మోడీ సులువుగా మళ్లీ అధికారాన్ని తెచ్చుకుంటారని ఆరోపించారు.

PREV
click me!

Recommended Stories

NDA సమావేశంలో చంద్రబాబు పంచ్ లకి పడిపడి నవ్విన మోదీ | NDA Meeting 2026 | Asianet News Telugu
Bharathiraja: భారతిరాజాకి నివాళి అర్పించిన తమిళ సినీ ప్రముఖులు | Asianet News Telugu