మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రేను కలిసిన సూపర్‌స్టార్ రజనీకాంత్.. ఎందుకంటే?

Published : Mar 18, 2023, 06:08 PM ISTUpdated : Mar 18, 2023, 06:19 PM IST
మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రేను కలిసిన సూపర్‌స్టార్ రజనీకాంత్.. ఎందుకంటే?

సారాంశం

సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ రోజు మహారాష్ట్రలో ఠాక్రే కుటుంబాన్ని కలుసుకున్నారు. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతో శ్రీకి వెళ్లి వారి కుటుంబాన్ని రజనీకాంత్ కలుసుకున్నారు. ఇది రాజకీయ సమావేశం కాదని ఓ నేత స్పష్టం చేశారు.  

ముంబయి: సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ రోజు మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే కుటుంబాన్ని  కలుసుకున్నారు. ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతో శ్రీకి రజనీకాంత్ వెళ్లారు. రాజకీయాలకు దూరంగా ఉన్న రజనీకాంత్.. ఒక రాజకీయ పార్టీ చీఫ్‌ను వారి నివాసానికి వెళ్లి కలువడంపై చర్చ మొదలైంది. రజనీకాంత్ ఎందుకు ఠాక్రే కుటుంబాన్ని కలిశారు? అనే సందేహాలు రావడం సహజం. ఉద్ధవ్ ఠాక్రే వర్గం శివసేన పార్టీకి చెందిన ఓ నేత దీనిపై మాట్లాడారు.

రజనీకాంత్ ఈ రోజు బాంద్రాలోని మాతో శ్రీలో ఉద్ధవ్ ఠాక్రే, ఆయన భార్య రశ్మీ, కొడుకులు ఆదిత్య, తేజస్‌లను కలిశారని వివరించారు. ఇది రాజకీయ సమావేశం కాదని స్పష్టం చేశారు. అయితే, శివసేన పార్టీని స్థాపించిన బాల్ ఠాక్రే అంటే రజనీకాంత్ ఎంతో ఇష్టం. ఆయనకు బలమైన మద్దతుదారుడు. అందుకే మర్యాదపూర్వకంగా కలవడానికి రజనీకాంత్..ఠాక్రే కుటుంబాన్ని కలిశారని తెలుస్తున్నది.

 

 

Also Read: మళ్లీ కరోనా పంజా?.. కొత్తగా 841 కేసులు.. నెల క్రితం కొత్త కేసులు 156.. యాక్టివ్ కేసులు 5,389

వారంతా కలిసి ఫొటో దిగారు. ఆ ఫొటోలో వెనుక వైపు బాల్ ఠాక్రే చిత్రపటం ఉన్నది. మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిత్యా ఠాక్రే ఈ చిత్రాన్ని ట్విట్టర్‌లో షేర్ చేశారు. మాతో శ్రీకి రజనీకాంత్ మళ్లీ వచ్చిన క్షణం ఎంతో సంతోషంగా ఉన్నదని వివరించారు.

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !