రాజౌరిలో ఎన్ కౌంటర్ ప్రారంభం.. ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చేందుకు భద్రతా బలగాల ఆపరేషన్

By team teluguFirst Published Jan 2, 2023, 9:00 AM IST
Highlights

జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరి జరిగిన ఉగ్రదాడిలో ప్రమేయం ఉన్న ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు భద్రతా బలగాలు సోమవారం ఉదయం ఎన్ కౌంటర్ ప్రారంభించాయి. ఇందులో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇండియన్ ఆర్మీ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపడుతున్నాయి. 

జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో నలుగురు వ్యక్తులు మరణించగా.. మరో ఆరుగురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ఇందులో ప్రమేయం ఉన్న ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు భద్రతా బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయి. ఉగ్రదాడి జరిగిన గంటల వ్యవధిలోనే దాడిలో పాల్గొన్న ఇద్దరు ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు సోమవారం గాలింపు చర్యలు  చేపట్టి, భారీ వేట మొదలుపెట్టాయి. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఆర్మీ సిబ్బంది సంయుక్తంగా ఉగ్రవాదులను నిర్మూలించే ఈ మిషన్‌లో పాల్గొంటున్నారు.

ఉగ్రకుట్ర భగ్నం.. భారీ మొత్తంలో ఆయుధాలు,మందుగుండు సామగ్రి, డ్రగ్స్ స్వాధీనం.. ఎక్కడంటే..?

ఆదివారం రాజౌరిలోని డాంగ్రీ ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడిన విషయం తెలిసిందే. ఎగువ డాంగ్రీ గ్రామంలో 50 మీటర్ల దూరంలో ఉన్న మూడు ఇళ్లపై ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరిని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో తదుపరి చికిత్స కోసం విమానంలో జమ్మూకు తరలించారు. 

భార్యతో గొడవపడి.. రెండు రోజుల పసికందును నేలకేసి కొట్టిన కసాయి తండ్రి..

ఈ ఉగ్రదాడి ఘటనపై జమ్మూ జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) ముఖేష్ సింగ్ మీడియాతో మాట్లాడారు. ‘‘ ఇద్దరు ఉగ్రవాదులు వచ్చి ఎగువ డాంగ్రీ ప్రాంతంలోని మూడు ఇళ్లను టార్గెట్ గా  చేసుకొని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు చనిపోయారు. అయితే ఉగ్రవాదులను పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. పోలీసులు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్ పీఎఫ్), ఆర్మీ దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. త్వరలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెడుతాం’’అని ఆయన తెలిపారు.

మేఘాలయలో అర్ధరాత్రి భూకంపం.. భయంతో జనం పరుగులు

ఈ ఘటనలో గాయపడిన వారందరికీ చికిత్స అందిస్తున్నారని అసోసియేటెడ్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మెహమూద్ తెలిపారు. గాయపడినవారి శరీరంపై అనేక బుల్లెట్ గాయాలు ఉన్నాయని ఆయన చెప్పారు. కాగా.. రాజౌరిలో జరిగిన ఉగ్రదాడికి వ్యతిరేకంగా సోమవారం జమ్మూలో పలు సంస్థలు నిరసనలకు పిలుపునిచ్చాయి.

click me!