Asianet News TeluguAsianet News Telugu

ఉగ్రకుట్ర భగ్నం.. భారీ మొత్తంలో ఆయుధాలు,మందుగుండు సామగ్రి, డ్రగ్స్ స్వాధీనం.. ఎక్కడంటే..?

జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే వీటిని సరఫరా చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు.  ఈ మేరకు  పోలీసులు ఆదివారం సమాచారం అందించారు.

Jammukashmir police busts narco-terror module in Kupwara, one arrested
Author
First Published Jan 2, 2023, 6:12 AM IST

జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులపై భద్రతా దళాలు ఉక్కుపాదాన్ని మోపుతున్నాయి. తాజాగా భారీ ఉగ్ర కుట్రను భద్రతా బలగాలు ఛేదించాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడంతో పాటు ఆయుధాలను సరఫరా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకెళ్తే.. జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఓ వ్యక్తిని అరెస్టు చేసి ..అతని వద్ద నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

ఈ మేరకు ఆదివారం పోలీసులు సమాచారం అందించారు. ఆయుధాలు, మాదక ద్రవ్యాలు లోయలోని ఉగ్రవాద సంస్థకు సరాఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కుప్వారాలోని కర్నాలోని చత్కారీ ప్రాంతంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసుకున్నట్లు నిఘా వర్గాల నుంచి భద్రత బలగాలకు నిర్దిష్ట సమాచారం వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఆపరేషన్‌లో చట్కాడి నివాసి ఉమర్ అజీజ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. విచారణలో.. భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, మాదక ద్రవ్యాల సరుకును అందుకున్నట్లు అంగీకరించినట్లు అధికారి తెలిపారు. గారంగ్‌నార్డ్ చట్కాడి సమీపంలో భారీ మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.  

భారీ మొత్తంలో ఆయుధాల స్వాధీనం: 

స్వాధీనం చేసుకున్న వస్తువులలో ఐదు పిస్టల్స్, 10 పిస్టల్ మ్యాగజైన్లు, 77 పిస్టల్ బుల్లెట్లు, నాలుగు హ్యాండ్ గ్రెనేడ్లు , 9.450 కిలోల హెరాయిన్ లాంటి పదార్థం ఉన్న 10 ప్యాకెట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు  తెలిపారు. సమాచారం ప్రకారం.. ఈ సరుకు నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి అనుబంధంగా ఉన్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ కోసం ఉద్దేశించబడిందని అధికారి తెలిపారు.

ఉగ్రకాల్పుల్లో 3 మంది మృతి

కొత్త సంవత్సరం తొలిరోజే ఉగ్రవాదులు విరుచుకపడ్డారు. జమ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదుల కార్యకలాపాలు కనిపించాయి. మొదట రాజౌరిలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి ముగ్గురిని హతమార్చారు. ఈ దాడిలో మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని ఎంకే చౌక్‌లోని రద్దీ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ వాహనంపై గ్రెనేడ్ విసిరేందుకు ప్రయత్నించారు. అయితే లక్ష్యం తప్పి స్థానికంగా ఉన్న ఓ బాలుడికి చిన్నపాటి గాయాలు అయ్యాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios