రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు జూలై 6వ తేదీన ఎన్నికలు.. బ్రిజ్ భూషణ్ కు ఛాన్స్ ఉందా ? లేదా ?

Published : Jun 14, 2023, 11:39 AM IST
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు జూలై 6వ తేదీన ఎన్నికలు.. బ్రిజ్ భూషణ్ కు ఛాన్స్ ఉందా ? లేదా ?

సారాంశం

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కు జూలై 6వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తామని రిట్నరింగ్ అధికారి మంగళవారం ప్రకటించారు. అదే రోజున ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. అయితే ఈ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, ఆయన కుటుంబ సభ్యులకు పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తారా లేదా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. 

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ఎన్నికలు జూలై 6న జరుగనున్నాయి. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎన్నికల ప్రక్రియను ప్రారంభించడానికి భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి మహేష్ మిట్టల్ కుమార్ ను రిటర్నింగ్ అధికారిగా నియమించిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.

మండుతున్న మ‌ణిపూర్: మ‌ళ్లీ హింసాత్మ‌క ఉద్రిక్త‌త‌.. 9 మంది మృతి, 10 మందికి గాయాలు

అయితే ఎన్నికలు జరిగిన రోజే ఫలితాలను కూడా ప్రకటిస్తామని రిటర్నింగ్ అధికారి తన నోటిఫికేషన్ లో వెల్లడించారు. ఎలక్టోరల్ కాలేజీ ఏర్పాటుకు ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం నుంచి రెండు నామినేషన్ల స్వీకరణకు జూన్ 19 చివరి తేదీగా నిర్ణయించగా, జూన్ 22లోగా పరిశీలన పూర్తవుతుంది. ప్రతి రాష్ట్ర యూనిట్ ఇద్దరు ప్రతినిధులను పంపవచ్చు. ప్రతీ ప్రతినిధికి ఒక ఓటు ఉంటుంది. దీనిని బట్టి డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల ఎలక్టోరల్ కాలేజ్లో 50 ఓట్లు ఉంటాయి. అయితే గతంలో డబ్ల్యూఎఫ్ఐ రద్దు చేసిన కొన్ని రాష్ట్ర సంస్థలు కూడా 
ఎన్నికల్లో పాల్గొనేందుకు తమ వాదనను వినిపించినట్లు తెలిసింది.

జమ్మూ కాశ్మీర్ లో మళ్లీ రెండు భూకంపాలు.. కత్రా, దోడాలో కంపించిన భూమి.. ఆందోనళనకు గురైన స్థానికులు

ఆయా వర్గాల ప్రతినిధుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించిన తర్వాత రిటర్నింగ్ కార్యాలయం ఎవరికి ఓటు వేయాలో, ఎవరికి ఓటు వేయకూడదో నిర్ణయిస్తుంది. అయితే జూన్ 28 నుంచి జూలై 1వ తేదీ వరకు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం కల్పించారు. ఆ తర్వాత జూలై 2న పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తారు.

అందుకే రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ బ్యాన్ చేశారు - కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్

డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్ష, సీనియర్ ఉపాధ్యక్షుడు, నలుగురు ఉపాధ్యక్షులు, సెక్రటరీ జనరల్, కోశాధికారి, ఇద్దరు సంయుక్త కార్యదర్శులు, ఐదుగురు కార్యవర్గ సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. జమ్మూకాశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మిట్టల్ ను రిటర్నింగ్ అధికారిగా ఐఓఏ సోమవారం నియమించడంతో జూలై 4న ఎన్నికలు జరుగుతాయని విస్తృతంగా ఊహాగానాలు చెలరేగాయి. కానీ రెండు రోజులు తరువాత ఎన్నికలు జరగున్నట్టు స్పష్టం అయ్యింది.

ఎన్నికల ముందే విదేశీ శక్తులు మేల్కొంటాయి - జాక్ డోర్సే వ్యాఖ్యలపై మండిపడ్డ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

అయితే డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కుటుంబ సభ్యులు లేదా సహచరులను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతిస్తారా అనేది ఈ ఎన్నికల్లో మరో పెద్ద సమస్య. బ్రిజ్ భూషణ్ బంధువు ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రభుత్వం అనుమతించదని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ హామీ ఇచ్చారు. బ్రిజ్ భూషణ్ తో సంబంధం ఉన్న అర్హులైన అభ్యర్థులు ఎన్నికల్లో నామినేషన్ వేస్తే ఏమవుతుందో చూడాల్సి ఉంది. బ్రిజ్ భూషణ్ కుమారుడు కరణ్ గత డబ్ల్యూఎఫ్ఐలో ఉపాధ్యక్షుడిగా, యూపీ రెజ్లింగ్ అసోసియేషన్ తో అనుబంధం ఉంది. ఆయన అల్లుడు విశాల్ సింగ్ బీహార్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. వీరిద్దరూ రాష్ట్ర సంస్థ ప్రతినిధులుగా పోటీ చేయడానికి అర్హులు.

PREV
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్