Telangana: కేసీఆర్ నూత‌న ప్ర‌యోగం..! టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను నిర్ణయించే బాధ్యత ఆయనకే !?

Published : Jun 09, 2022, 09:57 AM ISTUpdated : Jun 09, 2022, 09:59 AM IST
Telangana: కేసీఆర్ నూత‌న ప్ర‌యోగం..! టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను నిర్ణయించే బాధ్యత ఆయనకే !?

సారాంశం

Telangana: తెలంగాణ రాజ‌కీయాలు రోజుకో కీల‌క మ‌లుపు తిరుగుతున్నాయి. ప్ర‌స్తుతం ఉన్న తెరాస ఎమ్యెల్యేల‌పై తీవ్ర స్థాయిలో ప్ర‌జా వ్యతిరేకత వెలువ‌డుతున్న నేప‌థ్యంలో తెరాస్ బాస్ కేసీఆర్ ముందస్తుకు వెళ్లాల‌ని భావిస్తున్నారట‌. ప్రశాంత్‌ కిశోర్‌ బృందం సర్వేల్లో ప‌లు సంచనాలు.  

Telangana: తెలంగాణ రాజ‌కీయాలు క్ర‌మంగా హీటెక్కుతున్నాయి. తిరిగి అధికారాన్ని చేప‌ట్టాల‌ని అధికార టీఆర్ఎస్ ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తుంటే.. బీజేపీ, కాంగ్రెసులు ఎలాగైనా అధికారాన్ని హ‌స్త‌గతం చేసుకోవాల‌ని తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అధికార పార్టీ టీఆర్ఎస్ లో ఓ అంశం హ‌ట్ టాఫిక్ గా మారింది. ఆ అంశం పార్టీ నేత‌ల‌తో పాటు.. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కూడా ఓ వంతు దడ‌పుట్టిస్తుంద‌నే చెప్పాలి. ఆ విష‌యమేమిటంటే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను నిర్ణ‌యించే.. అవ‌కాశం.. తెరాస అధిష్టానానికి కాకుండా.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్ ఇస్తున్నార‌ట‌. ఈ మేర‌కు తెరాస అధినేత, సీఎం కేసీఆర్ ఆయ‌న‌కే పూర్తి స్థాయిలో బాధ్యతను అప్ప‌జెప్ప‌నున్నార‌ట‌.. ఇప్పుడు ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో హ‌ట్ టాఫిక్ గా మారింది.  

పీకేకు బాధ్య‌త‌లు అప్ప‌జెప్ప‌డానికి కార‌ణ‌మేంటీ? 

గ‌త కొన్ని నెల‌ల కిత్రం .. పీకే బృందం.. తెలంగాణ‌లో ప‌ర్య‌టించి.. తెరాస‌ ప్రభుత్వ పనితీరు, ఎమ్మెల్యేల పట్ల ప్రజల అభిప్రాయం, పార్టీ విజయావకాశాలు తదితర అంశాలపై సర్వే నిర్వ‌హించింది. ఈ క్రమంలో ప‌లు సంచ‌ల‌న విషయాలు తెలిశాయంట‌.. 

ప్ర‌స్తుతం ఉన్న  తెరాస  సిటింగ్ ఎమ్మెల్యేలలో సగానికి పైగా ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందట‌. వారికి మ‌రోసారి టికెట్లు ఇస్తే.. పార్టీకి మ‌నుగ‌డ‌కు ప్రమాదమని సర్వేల్లో తేలినట్లు స‌మాచారం. ముఖ్యంగా సగానికిపైగా ఎమ్మెల్యేలు ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. సిటింగ్‌ ఎమ్మెల్యేలతోనే  ఎన్నికలకు వెళ్లే... దక్షిణ తెలంగాణలోని మూడో స్థానానికి పడిపోయే దుస్థితి కూడా ఉందని పీకే బృందం తెలిపిన‌ట్టు సమాచారం. ఈ వ్యతిరేకత నెలకొనడానికి ఆయా ఎమ్మెల్యేలు, వారి అనుచరులు చేసిన   దందాలే కారణమని స్థానికంగా వినిపిస్తున్నాయి. ఎన్నికల రాజకీయం ఖరీదైన నేపథ్యంలో ఏ పార్టీ ఎమ్మెల్యేకైనా ఆర్థిక వనరులను సమకూర్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది.

ఈ నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ ఈ సారి కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లాల‌ని భావిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌జావ్య‌తిరేక‌త ఉన్న నియోజకవర్గాల్లో పరిస్థితిని చక్కదిద్దేందుకు పార్టీ పరంగా చర్యలు తీసుకోవడం ప్ర‌స్తుతం సాధ్యం కాని ప‌ని.. ఈ ప‌రిస్థితి మ‌రింత చేదాట‌క ముందే.. ముందస్తుకు వెళ్లాల‌ని యోచిస్తున్నార‌ట‌.. ఒక‌వేళ అదే జ‌రిగిందే.. అయితే కర్ణాటకతోపాటు 2023 ఏప్రిల్‌లో ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది.

అది జరగాలంటే.. ఈ ఏడాది డిసెంబరు లో గానీ, వచ్చే ఏడాది జనవరిలో గానీ తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయాల్సి ఉంటుంది. ఇప్ప‌టి నుంచి చూస్తే.. కేవ‌లం  ఆరు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంటుంది. 

ఈలోగా నియోజకవర్గాల్లో సిటింగ్‌ ఎమ్మెల్యేలకు సానుకూల పరిస్థితులు కల్పించడం ఆసాధ్యం. అందుకే ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న సిటింగ్ ఎమ్మెల్యేలను ఉద్వాస‌న ప‌లికి.. కొత్త వారిని బరిలోకి దించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ మేర‌కు ఆ ప‌నిని  ప్రశాంత్‌ కిశోర్‌కు సీఎం కేసీఆర్‌ అప్పగించనున్నట్లు సమాచారం. ఆయ‌న బృందం చేసిన‌ స‌ర్వే ప్ర‌కారం .. సీట్ల కేటాయింపు జ‌రుగుతాయట‌.. ప్ర‌తి నియోజ‌కవ‌ర్గంపై ప్ర‌త్యేక దృష్టి సారించి.. ప్ర‌స్తుతం ఉన్న సిట్టింగ్ నేత‌ల‌నే బ‌రిలో దించాలా.. లేదా  మరో నేత‌ను  బరిలోకి దించాలా?  లేదా..   సామాజిక సమీకరణాల ఆధారంగా  వేరే వారిని ఎంపిక చేయాలా? అన్న అభిప్రాయాన్ని పీకే చెప్పనున్నట్లు, ఆ మేరకు కేసీఆర్‌ అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు చెబుతున్నారు. 

భారీ ప్రక్షాళన! 

పీకే నివేదిక ప్రకారం.. అనేక మార్పులు  జ‌రిగే అవ‌కాశముంది. ఇప్ప‌టికి ప‌లువురు సిటింగ్ ఎమ్మెల్యేలు ప్ర‌జాగ్రహాన్ని గురైన ఘ‌ట‌న‌లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీట్ల కేటాయింపులో భారీ ప్రక్షాళన చేసే అవకాశం ఉన్నట్లు స‌మాచారం. అయితే.. ప్ర‌స్తుతం ఉన్న‌ సిటింగ్ ఎమ్మెల్యేల‌ను  కాదని కొత్త వారికి టికెట్‌ ఇచ్చే క్రమంలో దానికి అనుకూల వాతావరణాన్నీ నియోజకవర్గంలో తీసుకురావాల్సి ఉంటుంది. 
ఈ క్ర‌మంలో.. టికెట్‌ దక్కని సిటింగ్ ఎమ్మెల్యేల‌ను, వారి అనుచరులనూ బుజ్జగించాల్సిన అవసరం ఉంటుంది. 

అలాగే.. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తగ్గించేలా..  పాలనలో భారీస్థాయిలో ప్రక్షాళన చేయాల‌ని భావిస్తున్నారట‌. అయితే.. సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే.. ఈ స‌మ‌యం స‌రిపోతుందా? ఉన్న  ఈ 8 నెలల స్వల్ప వ్యవధిలో అసంతృప్తి నేత‌ల‌ను బుజ్జగించడం తెరాస‌ అధిష్ఠానానికి సాధ్యమవుతుందా?  అనేది.. ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. పీకే- కేసీఆర్ వ్యూహాల‌కు తెలంగాణ ప్ర‌జానీకం ఎలాంటి తీర్పు ఇస్తోందో ఎన్నిక‌ల ఫ‌లితాల‌ వ‌ర‌కు వేచిచూడాల్సిందే.. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !