BJP Chief JP Nadda: 'ఇది మోడీ అందించిన ర‌క్ష‌ణ క‌వ‌చం'.. కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్ర‌శంసించిన బీజేపీ చీఫ్‌

Published : Jun 09, 2022, 08:30 AM IST
BJP Chief JP Nadda: 'ఇది మోడీ అందించిన ర‌క్ష‌ణ క‌వ‌చం'.. కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్ర‌శంసించిన బీజేపీ చీఫ్‌

సారాంశం

BJP Chief JP Nadda: కేంద్ర ప్రభుత్వ విధానాలను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశంసించారు. కోల్‌కతాలోని నేషనల్ లైబ్రరీలో జ‌రిగిన‌ బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో ఆయ‌న మాట్లాడుతూ..  కార్యక్రమంలో మాస్క్‌లు లేకుండా కూర్చుటున్నామంటే.. కేంద్ర ప్రభుత్వం అనుస‌రించిన విధానాల వ‌ల్ల సాధ్య‌మైంద‌ని అన్నారు.    

BJP Chief JP Nadda: గత రెండేళ్లుగా దేశం కరోనాపై యుద్ధం చేస్తోంది. అయితే గతంతో పోలిస్తే కరోనా వ్యాప్తి తగ్గింది. దీని కారణంగా.. చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనాకు సంబంధించిన పరిమితులను సడలించాయి. మాస్క్‌లు ధరించడం వంటి సూచనలలో జరిమానాలను విధించ‌డం లేదని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు.

మరోవైపు.. కరోనా నివారణ, వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వ విధానాలను జేపీ నడ్డా మరోసారి ప్రశంసించారు. బుధవారం, కోల్‌కతాలోని నేషనల్ లైబ్రరీలో బిజెపి రాష్ట్ర కార్యవర్గంలో నడ్డా ప్రసంగిస్తూ.. మీరందరూ ఒకరికొకరు దగ్గరగా కూర్చున్నారని, ఎవరూ ముసుగు ధరించడం లేదంటే.. అది మోదీ జీ అందించిన రక్షణ కవచమ‌ని అన్నారు. భార‌త్ క‌రోనా మీద విజ‌యం సాధించింద‌ని అన్నారు.
 
ఇతర దేశాలను ప్రస్తావిస్తూ.. అమెరికాలో క‌రోనా విజృంభిస్తోందని, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కూడా ఇప్ప‌టికీ మాస్క్ ధ‌రిస్తూనే ఉన్నారని అన్నారు. బెంగాల్‌తో సహా అనేక రాష్ట్రాల్లో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి కాదని, ఇది మన దేశంలోనే సాధ్య‌మైంద‌ని, మోడీ ప్ర‌భుత్వం క‌రోనా మీద విజ‌యం సాధించింద‌ని అన్నారు. 

మహారాష్ట్రలో క‌రోనా ప్ర‌స్తావిస్తూ.. బుధవారం 2,710 కొత్త కరోనావైరస్ సంక్రమణ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ మేరకు ఆరోగ్య శాఖ అధికారులు సమాచారం అందించారు. అంటువ్యాధి కారణంగా చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య ప్రస్తుతం పది వేలకు చేరుకుందని, అయితే ఈ మహమ్మారి కారణంగా మరెవ్వరూ మరణించలేదని అన్నారు. మహారాష్ట్ర‌లో మొత్తం కోవిడ్ -19 కేసుల సంఖ్య 78,98,815 కు పెరిగిందని ఆరోగ్య శాఖ తెలిపింది.

హెల్త్ డిపార్ట్‌మెంట్ గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో క‌రోనాతో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 9,806.  మంగళవారం నాడు 1,881 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదు కాగా.. ముందురోజు సోమవారం 1,036 కేసులు న‌మోద‌య్యాయ‌ని అధికారులు తెలిపారు.

ఇదిలాఉంటే..  భారతదేశంలో గ‌త 24 గంట‌ల్లో (బుధవారం) మొత్తం 5,233 కొత్త కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 4,31,90,282 కు చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో రోజువారీ పాజిటివిటీ రేటు 1.62 శాతం న‌మోదు అయ్యింది.  వారపు పాజిటివిటీ రేటు 0.91 శాతంగా నమోదైందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రభుత్వ డేటా ప్రకారం.. క్రియాశీల COVID-19 కేసుల సంఖ్య‌ 28,857 కు పెరిగింది. కోవిడ్ కారణంగా బుధవారం నాడు ఏడుగురు మ‌ర‌ణించారు. దీంతో మరణాల సంఖ్య 5,24,715 కు పెరిగింది.

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !