ఇండిగో విమానం ఫుడ్ ఏరియాలో బొద్దింకల స్వైరవిహారం..వీడియో వైరల్

By SumaBala Bukka  |  First Published Feb 23, 2024, 12:32 PM IST

సోషల్ మీడియాలో ఇటీవల ఓ వీడియో వైరల్ గా మారింది. అది ఇండిగో విమానంలోని పరిశుభ్రతమీద ప్రశ్నలు లేవనెత్తుతోంది. దీనిమీద నెటిజన్ల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. 


విమాన ప్రయాణాన్ని తొందరగా గమ్యం చేరుకోవడం కోసం ఎంచుకుంటుంటారు. అదే సమయంలో విమానంలో సౌకర్యవంతంగా ప్రయాణించాలనీ కోరుకుంటారు. కానీ.. కొన్నిసార్లు ఇది తీవ్ర అసౌకర్యాన్ని, ఇబ్బందినీ ఎదుర్కోవడానికి దారి తీస్తుంది. అలాంటి ఘటనే ఒకటి ఇండిగో ఎయిర్ లైన్స్ లో వెలుగుచూసింది. ఇటీవల, ఇండిగో విమానంలోని ఆహార ప్రదేశంలో బొద్దింకలు పాకుతున్న వీడియో  వీడియో సోషల్ మీడియాలో వెలుగు చూసింది. 

దీంతో విమానాల పరిశుభ్రత ప్రమాణాలపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ సంఘటన ప్రయాణికులు, విమానయాన సంస్థ దృష్టిని ఆకర్షించింది, సమస్యను పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి మళ్లేలా చేసింది. ఈ వీడియోను జర్నలిస్ట్ తరుణ్ శుక్లా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇండిగో విమానంలోని ఫుడ్ ఏరియాలో బొద్దింకలు ఉన్నట్లు కనిపిస్తుండడంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎయిర్‌లైన్స్ దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 

Latest Videos

షేర్ చేసిన వెంటనే ఈ వీడియో వైరల్ గా మారింది. ఇండిగో విమానాలలో పరిశుభ్రతపై నెటిజన్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. "విమానంలోని ఆహారం ఉండే ప్రదేశంలో, లేదా విమానంలో మరెక్కడైనా కానీ బొద్దింకలు ఉండడం నిజంగా భయంకరంగా ఉంటుంది. ఇండిగో విమానాల పరిశుభ్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది కాబట్టి, దీన్ని తీవ్రంగా పరిశీలిస్తుందని, ఇది ఎలా జరిగిందో తనిఖీ చేస్తుందని ఆశిస్తున్నాం" అని ఒక నెటిజన్ స్పందించాడు. 

వైరల్ వీడియోకు ప్రతిస్పందనగా, ఇండిగో సమస్యను గుర్తించింది. పరిస్థితిని పరిష్కరించడానికి తక్షణ చర్య తీసుకున్నట్లు ప్రయాణికులకు హామీ ఇచ్చింది. విమానయాన సంస్థ సిబ్బంది బాధిత విమానంలో సత్వర చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.  ముందుజాగ్రత్త చర్యగా, మొత్తం విమానాన్ని క్రిమిసంహారక మందులు, ఫాగ్ ప్రక్రియతో పూర్తిగా శుభ్రపరిచాం.. అని తెలిపారు. 

"ఇండిగోలో, సురక్షితమైన, అవాంతరాలు లేని అనుభవాన్ని అందించడానికి, ప్రయాణీకులకు ఏదైనా అసౌకర్యం కలిగితే చింతిస్తున్నాం" అని సంస్థ ప్రకటించింది. అయితే, ఇండిగో విమానంలో కీటకాల గురించి ఆందోళనలను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది ఏప్రిల్‌లో, ఒక ప్రయాణీకుడు భోజనం చేస్తున్నప్పుడు తమ టేబుల్‌పై బొద్దింక పాకుతున్న వీడియోను షేర్ చేశాడు. అంతకుముందు, 2022 అక్టోబర్‌లో పాట్నా నుండి ఢిల్లీకి వెళ్లే విమానంలో ఒక ప్రయాణీకుడు బొద్దింకను గుర్తించారు. ఈ సంఘటనలు ఎయిర్‌లైన్ పరిశ్రమలో పరిశుభ్రత ప్రమాణాల నిరంతర పర్యవేక్షణ, నిర్వహణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి.

 

India's most profitable air carrier Indigo Airlines served me food and immediately cockroach appeared and had a bite too.
This is the same Airlines which never apologizes when there is a flight delay / cancel / excess baggage even by 1 kg.

Now they are apologizing many a times… pic.twitter.com/xuc9JK3Hf3

— Sudipto Chowdhuri (@SudiptoTalks)
click me!