ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల: ఫిబ్రవరి 8న పోలింగ్

By sivanagaprasad KodatiFirst Published Jan 6, 2020, 3:42 PM IST
Highlights

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా సోమవారం ప్రకటించారు. ఫిబ్రవరి 22తో కేజ్రీవాల్ సర్కార్ కాలపరిమితి ముగియనుంది. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా సోమవారం ప్రకటించారు. ఫిబ్రవరి 22తో కేజ్రీవాల్ సర్కార్ కాలపరిమితి ముగియనుంది. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 67 స్థానాలు దక్కించుకుని ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని అందుకుంది.

Also Read:JNU campus : ముసుగులేసుకుని వచ్చి చితకబాదేశారు...

ఎన్నికల నిర్వహణ కోసం 13,767 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఈసీ తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 1.46 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని.. పోలింగ్ సందర్భంగా భద్రతా విధులకు గాను 90 వేల మంది సిబ్బందిని వినియోగించనున్నట్లు సునీల్ అరోరా వెల్లడించారు. మొత్తం 70 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తామని సీఈసీ తెలిపారు. 

ముఖ్యమైన తేదీలు:
* జనవరి 14న నోటీఫికేషన్ విడుదల
* జనవరి 24తో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగింపు
* ఫిబ్రవరి 8న పోలింగ్
* ఫిబ్రవరి 11న ఓట్ల లెక్కింపు

Also Read: జేఎన్‌యూలో దాడి: లెప్టినెంట్ గవర్నర్‌‌తో వీసీ భేటీ, అమిత్‌ షా ఫోన్

click me!