26/11 గుర్తుకొచ్చేలా చేసింది : జేఎన్‌యూ ఘటనను ఖండించిన ఉద్ధవ్ థాక్రే

Siva Kodati |  
Published : Jan 06, 2020, 03:04 PM IST
26/11 గుర్తుకొచ్చేలా చేసింది : జేఎన్‌యూ ఘటనను ఖండించిన ఉద్ధవ్ థాక్రే

సారాంశం

ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ వర్సిటీలో విద్యార్ధులపై జరిగిన దాడి ఘటనను శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఖండించారు. జేఎన్‌యూ ఘటనను 26/11 ఉగ్రదాడితో ఆయన పోల్చారు

ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ వర్సిటీలో విద్యార్ధులపై జరిగిన దాడి ఘటనను శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఖండించారు. జేఎన్‌యూ ఘటనను 26/11 ఉగ్రదాడితో ఆయన పోల్చారు.

Also Read:జేఎన్‌యూలో దాడి: లెప్టినెంట్ గవర్నర్‌‌తో వీసీ భేటీ, అమిత్‌ షా ఫోన్

మరోవైపు జేఎన్‌యూ ఘటనను దేశవ్యాప్తంగా పలువురు ముఖ్యమంత్రులు, రాజకీయ నేతలు ఖండించారు. కాగా ఆదివారం రాత్రి సుమారు 50 మంది దుండగులు ముసుగులు ధరించి వర్సిటీలోకి ప్రవేశించారు. కర్రలు, రాళ్లతో విద్యార్ధులు, ప్రొఫెసర్లపై విచక్షణారహితంగా దాడికి దిగడంతో పాటు ఆస్తులను ధ్వంసం చేశారు.

దుండగుల దాడిలో జేఎన్‌యూ విద్యార్ధి సంఘం నేత అయిషీ ఘోష్ సహా 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దాడి తర్వాత జేఎన్‌యూఎస్‌యూ, ఏబీవీపీ సంస్థలు పరస్పరం విమర్శలు చేసుకున్నాయి.

Also Read:JNU campus : ముసుగులేసుకుని వచ్చి చితకబాదేశారు.

దాడికి భయపడి కొందరు విద్యార్ధులు హాస్టళ్లలోని గదుల్లో దాక్కొన్నారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఢిల్లీ పోలీస్ కమీషనర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ దాడికి పాల్పడిన కొందరు దుండగులను పోలీసులు గుర్తించారు. 

PREV
click me!

Recommended Stories

Special Trains for Sankranti Festival: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు| Asianet News Telugu
Real estate: నెల రోజుల్లో రూ. 20 ల‌క్ష‌ల లాభం.. అక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ అంతలా ఎందుకు పెరుగుతోంది.?