అయోధ్యకు ఫ్లైట్‌లో వృద్ద మహిళ: పైలెట్ కు నమస్కరించి... వీడియో వైరల్

Published : Mar 30, 2024, 09:42 AM IST
అయోధ్యకు ఫ్లైట్‌లో వృద్ద మహిళ: పైలెట్ కు నమస్కరించి... వీడియో వైరల్

సారాంశం

విమానంలో ప్రయాణీస్తున్న ఓ వృద్ద మహిళ  పైలెట్ మధ్య చోటు చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో చోటు చేసుకుంది. అయోధ్యకు వెళ్లే విమానంలో ఈ ఘటన జరిగింది.

న్యూఢిల్లీ:అయోధ్యకు వెళ్లే విమానంలో చోటు చేసుకున్న ఘటన  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  అయోధ్యకు వెళ్లే విమానంలోకి ప్రవేశించిన మహిళ పైలెట్ కు నమస్కరించింది. పైలెట్ ను ఆ మహిళ లక్ష్మిదేవిగా అభివర్ణించింది.పైలెట్ ఆ మహిళను ఆప్యాయంగా కౌగిలించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇన్‌స్టాగ్రామ్ లో  టీనా గోస్వామి ఈ వీడియోను అప్ లోడ్ చేశారు.  వృద్ద మహిళ  పైలట్ కు నమస్కరించడంతో వీడియో ప్రారంభం కానుంది.భారతీయ సంస్కృతిలో కుమార్తెలను ఎలా గౌరవిస్తారో ఈ వీడియో చూపుతుందని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు.మహిళలను శక్తి స్వరూపిణి లక్ష్మితో  పోల్చారని ఆ నెటిజన్ పేర్కొన్నారు.భారతీయ వారసత్వం, సంప్రదాయాలను ఈ వీడియో చూపుతుందని  మరొకరు వ్యాఖ్యానించారు.

 

రెండు రోజుల క్రితం ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేశారు.  ఈ వీడియో మూడు మిలియన్లకు పైగా  మంది వీక్షించారు.  ఈ వీడియోను పలువురు  షేర్ చేశారు. మరికొందరు ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియో  హృదయానికి హత్తుకొనే విధంగా ఉందని  నెటిజన్ ఒకరు వ్యాఖ్యానించారు.  

 


 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !