
ఇకపోతే.. గత నెలలోనూ కోల్‌కతాలోని పార్క్ స్ట్రీట్, మెక్‌లియోడ్ స్ట్రీట్, గార్డెన్ రీచ్, మోమిన్‌పూర్‌లలో ఈడీ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. గార్డెన్ రీచ్ ప్రాంతంలోని వ్యాపారవేత్త అమీర్ ఖాన్ నివాసంలో జరిపిన సోదాల్లో ఏడు కోట్ల రూపాయల నగదుతోపాటు పలు ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదు రూ.15 కోట్లు దాటవచ్చని భావిస్తున్నారు. మొబైల్ గేమింగ్ యాప్ ద్వారా ప్రజల ఖాతాల నుంచి డబ్బు మళ్లించిన ఉదంతం చోటుచేసుకుంది.
ALso Read:గేమింగ్ యాప్‌తో స్కామ్.. నిందితుడి ఇంట్లో రూ.7 కోట్ల నగదు.. కొనసాగుతున్న ఈడీ సోదాలు
‘ఈ-నగ్గెట్స్’ అనే మొబైల్ గేమింగ్ యాప్ ద్వారా భారీ ఎత్తున మోసానికి పాల్పడినట్టు తెలుస్తుంది. ఈ కుంభకోణంలో భాగంగా పక్కా ప్లాన్ ప్రకారం.. యూజర్లకు రివార్డులు, కమీషన్ ఇచ్చారు. వారు పొందిన బ్యాలెన్స్ ను వ్యాలెట్ ద్వారా సులభంగా తీసుకునే సౌకర్యం కల్పించారు. ఈజీగా డబ్బు పొందవచ్చనే నమ్మకం కలిగింది. ఈ క్రమంలో యూజర్లు భారీ మొత్తంతో ఆర్డర్లు కొనుగోలు చేశారు. ఇలా ప్రజల నుంచి కోట్లలో డబ్బులు జమ అయిన.. తర్వాత ఒక్కసారిగా నగదును విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని నిలిపివేశారు. అదే సమయంలో సిస్టమ్, సర్వర్ అప్‌గ్రేడ్ పేరుతో ప్రొఫైల్స్‌తోపాటు డేటా అంతా ఏరేజ్ చేశారు. దీంతో మోసపోయినట్లు బాధితులు గ్రహించారు.