Earthquake: అరుణాచల్ ప్రదేశ్ లో భూ ప్ర‌కంప‌న‌లు.. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత న‌మోదు

Published : Jul 28, 2023, 10:25 AM IST
Earthquake: అరుణాచల్ ప్రదేశ్ లో భూ ప్ర‌కంప‌న‌లు.. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత న‌మోదు

సారాంశం

Earthquake: అరుణాచల్ ప్రదేశ్ లోని పాంగిన్ ఉత్తర దిశలో శుక్రవారం రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ట్విటర్ లో తెలిపింది. ఉదయం 8.50 గంటలకు భూప్రకంపనలు సంభవించాయని పేర్కొంది.   

Arunachal Pradesh Earthquake: అరుణాచల్ ప్రదేశ్ లోని పాంగిన్ ఉత్తర దిశలో శుక్రవారం రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ట్విటర్ లో తెలిపింది. ఉదయం 8.50 గంటలకు భూప్రకంపనలు సంభవించాయని పేర్కొంది. 

వివ‌రాల్లోకెళ్తే.. అరుణాచల్ ప్రదేశ్‌లోని సియాంగ్ ప్రాంతంలో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. శుక్ర‌వారం ఉదయం 8.50 గంటలకు భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకారం, భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ భూకంపం గురించి పేర్కొంటూ.. శుక్రవారం ఉదయం అరుణాచల్ ప్రదేశ్‌లోని సియాంగ్ జిల్లాలోని పాంగిన్ పట్టణంలో రిక్టర్ స్కేల్‌పై 4.0 తీవ్రతతో భూకంపం సంభవించిందని తెలిపింది. 

అంతకుముందు జూలై 22న, ఆదివారం ఉదయం అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో రిక్టర్ స్కేలుపై 3.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది. NCS ప్రకారం, భూకంపం ఉదయం 6.56 గంటలకు సంభవించింది. అరుణాచల్ ప్రదేశ్‌లో 5 కిలోమీటర్ల లోతులో 3.3 రిక్టర్ స్కేల్ భూకంపం సంభవించింది.

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !