వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో ఓ ప్రయాణికుడికి వింత అనుభవం ఎదురైంది. అతడికి రైల్వే సిబ్బంది అందించిన ఆహారంలో ఓ బొద్దింక కనిపించింది. దీంతో ఆ ప్రయాణికులు ఆ ఆహారం ఫొటోలను సోషల్ మీడియాతో పెట్టడంతో ఐఆర్సీటీసీ స్పందించింది.
వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో ఓ ప్రయాణికుడికి అందించిన ఆహారంలో బొద్దింక వచ్చింది. దీంతో ఆ ప్రయాణికుడు ఆ బొద్దింక, తనకు రైల్వే సిబ్బంది అందించిన ఇతర ఆహారాన్ని ఫొటోలు తీసి, సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. దీనికి ఐఆర్సీటీసీ స్పందించింది. ప్రయాణికుడి నుంచి క్షమాపణలు చెప్పింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.
భార్యను హతమార్చి.. రెండేళ్ల కూతురును రైలు పట్టాలపై పడుకోబెట్టి.. దారుణం
మధ్యప్రదేశ్ కు చెందిన సుబోధ్ పహలాజన్ అనే ప్రయాణికుడు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలులో భోపాల్ నుంచి గ్వాలియర్ ప్రయాణిస్తున్నాడు. అయితే అతడికి ఐఆర్సీటీసీ క్యాటరింగ్ సిబ్బంది ఈ ఆహారాన్ని వడ్డించారు. అందులో రోటీ, ఇతర ఆహార పదార్థాలు ఉన్నాయి. అందులో ఒక్క ఆహార పదార్థాన్ని అతడు తెరిచి చూడటం మొదలు పెట్టారు.
found a cockroach in my food, in the vande bharat train. pic.twitter.com/Re9BkREHTl
— pundook🔫🔫 (@subodhpahalajan)రోటీ కవర్ తెరిచి చూడగానే అందులో ఓ బొద్దింకను చూసి అవాక్కయ్యాడు. వెంటనే తనకు అందించిన ఆహార పదార్థాల ఫొటోలను, ఆ రోటీపై బొద్దింక ఉన్న ఫొటోలను తీసి క్రో బ్లాగింగ్ ప్లాట్ ఫారమ్ అయిన ట్విట్టర్ లో పోస్టు పెట్టారు. తన పోస్టుకు అధికారిక ఐఆర్సీటీసీ పేజీని ట్యాగ్ చేశారు. అతడు షేర్ చేసిన ఫొటోల్లో ఓ రొట్టెకు పురుగు అంటుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ పోస్టుకు ‘‘వందే భారత్ రైలులో నా ఆహారంలో బొద్దింకను కనుగొన్నాను’’ అని క్యాప్షన్ పెడుతూ అని పహలాజన్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు.
సిరియాలో బాంబు పేలుడు.. ఆరుగురు మృతి, 23 మందికి గాయాలు
అయితే ఈ పోస్టుపై ఐఆర్సీటీసీ వెంటనే స్పందించింది. ప్రయాణికుడి పీఎన్ఆర్ నెంబర్ ను కోరింది. దీంతో అతడు తన పీఎన్ఆర్ నెంబర్ ను అందించాడు. అనంతరం మళ్లీ ఐఆర్సీటీసీ బదులిస్తూ.. ‘‘మీకు ఎదురైన చేదు అనుభవానికి చింతిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటాం’’ అని హామీ ఇచ్చింది. కాగా.. రైల్వేలో ఆహార నాణ్యత, సౌకర్యాలకు సంబంధించిన ఆందోళనలను వెలుగులోకి తెచ్చిన అనేక సంఘటనలలో ఇది ఒకటి. గతంలోనూ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చాయి.