
వారిద్దరూ భార్యాభర్తలు. వారికి రెండేళ్ల కూతురు ఉంది. కొన్ని రోజుల నుంచి ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా వారి మధ్య మొదలైన గొడవ తీవ్ర వాగ్వాదంగా మారింది. ఆ భర్త తన భార్యపై కోపంతో ఆమెను హతమార్చాడు. అనంతరం రెండేళ్ల కూతురును దగ్గరలో ఉన్న రైలు పట్టాలపై పడుకోబెట్టాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్ లో జరిగింది.
మణిపూర్ వైరల్ వీడియో కేసును సీబీఐకి అప్పగింత.. సుప్రీం కోర్టులో కేంద్రం వివరణ..
ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. యూపీలోని అలీగఢ్ సిటీకి చెందిన అసిఫ్‌కు హీనా అనే యువతితో కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ప్రస్తుతం రెండేళ్ల వయస్సు ఉన్న కూతురు ఉంది. అయితే కొంత కాలం నుంచి భార్యభర్తల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
గత తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ‘యూపీఏ’ పేరు ‘ఇండియా’గా మారింది - విపక్షాలపై ప్రధాని మోడీ సెటైర్లు
ఈ క్రమంలో బుధవారం రాత్రి కూడా వారిద్ధరికీ గొడవ జరిగింది. అయితే ఈ సారి అది తీవ్ర వాగ్వాదంగా మారింది. దీంతో కోపోద్రిక్తుడైన అసిఫ్ తన భార్యను హీనాను దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఇంట్లో ఉన్న రెండేళ్ల పాపను తీసుకొని బయటకు వెళ్లాడు. ఆ పాపను కూడా చంపేయాలనే ఉద్దేశంతో దగ్గరలో ఉన్న రైలు పట్టాలపైకి తీసుకెళ్లి పడుకోబెట్టాడు.
ఆ చిన్నారి ఏడుపు మొదలుపెట్టడంతో స్థానికంగా నివసిస్తున్న ప్రజలకు వినిపించింది. దీంతో వారంతా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. స్థానికులు రావడాన్ని గమనించిన అసిఫ్.. పాపను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు నిందితుడి అరెస్టు చేశారు. అతడిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.