
మెక్సికోలోని ఓక్సాకా ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 5.7 తీవ్రతతో నమోదైనట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. 87.729 కిలోమీటర్ల లోతులో 16.3541 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 94.2685 డిగ్రీల పశ్చిమ రేఖాంశంలో ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యిందని వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది.
జేఎన్‌యూలో కొత్త రూల్స్.. ధర్నా చేస్తే రూ. 20 వేల ఫైన్, హింసకు పాల్పడితే అడ్మిషన్ క్యాన్సిల్
అయితే ఈ భూకంపం వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి నష్టమూ, ప్రాణ నష్టమూ జరిగినట్టు నివేదికలు లేవు. కాగా.. ఇటీవల టర్కీలో భారీ భూకంపం సంభవించింది. ఇందులో మునుపెన్నడూ లేని విధంగా ప్రాణనష్టం జరిగింది. దాదాపు 50 వేల మరణాలు సంభవించాయని రిపోర్టులు పేర్కొన్నాయి. ఫిబ్రవరి 6న టర్కీ, సిరియా ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. ఇందులో గత శుక్రవారం నాటికే మృతుల సంఖ్య 50,000 దాటిందని నివేదికలు స్పష్టం చేశాయి. టర్కీలో 44,000 మందికి పైగా మరణించినట్లు అధికారిక వర్గాలు ప్రకటించాయి.
గత నెల 25వ తేదీన జపాన్ లో భూకంప సంభవించింది. హక్కైడో ద్వీపం యొక్క తూర్పు భాగంలో శనివారం సాయంత్రం బలమైన భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. ఈ మేరకు యూఎస్‌జీసీ అధికారులు వివరాలు వెల్లడించారు. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10:27 గంటలకు భూకంపం సంభవించింది. అంతకుముందు ఫిబ్రవరి 20న జపాన్‌లో భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైంది.
ఈసీ నియామక వ్యవస్థపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
భూమి లోపల ఏడు పలకలు నిరంతరం తిరుగుతూ ఉండటమే ఈ భూకంపాలకు కారణం. ఈ ప్లేట్లు ఎక్కువగా ఢీకొనే ప్రదేశాలను ఫాల్ట్ లైన్స్ అంటారు. ఇవి తరచుగా ఢీకొంటూ ఉంటాయి. దీని వల్ల ప్లేట్లు విరిగిపోతాయి. వాటి విచ్ఛిన్నం కారణంగా లోపల ఉన్న శక్తి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో అది ఓ మార్గాన్ని కనుగొంటుంది. దీని వల్ల ఆ ప్రాంతంలో భూమి కంపిస్తుంది. దీనినే భూకంపం అని అంటారు.