కర్నాటక హోంమంత్రి కాన్వాయ్‌ పోలీసు కారు ఢీ కొని బైకర్ మృతి.. మంత్రి ఏమన్నారంటే...

Published : Mar 02, 2023, 12:16 PM IST
కర్నాటక హోంమంత్రి కాన్వాయ్‌ పోలీసు కారు ఢీ కొని  బైకర్ మృతి.. మంత్రి ఏమన్నారంటే...

సారాంశం

వాహనం ప్రధాన కాన్వాయ్‌లో భాగం కాదని, కాన్వాయ్ వెనుకే ప్రయాణిస్తోందని కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర కార్యాలయం పేర్కొంది.  

కర్ణాటక : గత రాత్రి కర్ణాటకలోని హాసన్ జిల్లాలో  రాష్ట్ర హోంమంత్రి కాన్వాయ్‌ లోని పోలీసు వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఓ బైకర్ మృతి చెందాడు. అయితే, వాహనం ప్రధాన కాన్వాయ్‌లో భాగం కాదని, కాన్వాయ్ వెనుకే ప్రయాణిస్తోందని హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర కార్యాలయం పేర్కొంది. ఈ ప్రమాదంలో పోలీసు వాహనం ప్రమేయం ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారి ధృవీకరించారు.

చామరాజనగర్ జిల్లాలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా హాజరైన ఎన్నికల  ముందస్తు కార్యక్రమానికి హాజరై మంత్రి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. గత రాత్రి మంత్రి కాన్వాయ్ తిరిగి వస్తుండగా జిల్లా పోలీసు వాహనం ఒక వ్యక్తిని ఢీకొట్టిందని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపారు. ఈ ఘటనలో 45 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద సమయంలో పోలీసు వాహనాన్ని ఇన్‌స్పెక్టర్‌ నడుపుతున్నాడు.

పెళ్లికి నిరాకరించిందని.. ప్రియురాలిపై 16 కత్తిపోట్లు.. ప్రేమోన్మాది ఘాతుకం...

మంత్రి కార్యాలయం ప్రకారం, ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి వారు చాలా ముందుకు వెళ్లేవరకూ ప్రమాదం గురించి వారికి తెలియలేదు.హోంమంత్రి ఎస్కార్ట్ వాహనం ఒక వ్యక్తిని ఢీకొట్టి అతని మరణానికి కారణమైందన్న వార్తలు వాస్తవం కాదని..  ఆ వాహనం తన కాన్వాయ్‌లో భాగం కాదని ఆయన కార్యాలయం నుండి ఒక ప్రకటన తెలిపింది. అయితే, ప్రమాదంపై అప్రమత్తమైన మంత్రి తన కాన్వాయ్‌ను ఆపలేదన్న ఆరోపణలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.

అనంతరం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు జిల్లాలోని మలే మహదేశ్వర వద్ద బీజేపీ 'విజయ్ సంకల్ప యాత్ర'ను నడ్డా నిన్న జెండా ఊపి ప్రారంభించారు.

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu