జేఎన్‌యూలో కొత్త రూల్స్.. ధర్నా చేస్తే రూ. 20 వేల ఫైన్, హింసకు పాల్పడితే అడ్మిషన్ క్యాన్సిల్

Published : Mar 02, 2023, 12:51 PM IST
జేఎన్‌యూలో కొత్త రూల్స్.. ధర్నా చేస్తే రూ. 20 వేల ఫైన్, హింసకు పాల్పడితే అడ్మిషన్ క్యాన్సిల్

సారాంశం

ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ యాజమాన్యం కొత్త రూల్స్ తెచ్చింది. విద్యార్థులు ధర్నాలు చేస్తే వారిపై రూ. 20 వేల జరిమానా పడనుంది. క్యాంపస్‌లో హింసకు తెగబడితే వారి అడ్మిషన్ రద్దు చేసే ముప్పు కూడా ఉంటుంది.  

న్యూఢిల్లీ: జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ కొత్త రూల్స్ తెచ్చింది. ఒక పై విద్యార్థులు ధర్నాలు చేస్తే వారిపై రూ. 20 వేల జరిమానా విధిస్తుంది. వర్సిటీ క్యాంపస్‌లో హింసకు పాల్పడితే వారి అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తుంది. ఈ నిబంధనలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది. నిరసనలు, ఫోర్జరీ వంటి వివిధ రకాల చర్యలకు విధించే శిక్షల(పనిష్మెంట్లు) గురించి పది పేజీల్లో పేర్కొంది. బీబీసీ డాక్యుమెంటరీ స్క్రీనింగ్ సందర్భంలో యూనివర్సిటీ క్యాంపస్‌లో ప్రదర్శనలు జరిగాయి. ఈ ఆందోళనల నేపథ్యంలోనే కొత్త రూల్స్‌ను యూనివర్సిటీ తేవడం గమనార్హం.

ఈ రూల్స్ పత్రాలను వర్సిటీ అత్యున్న నిర్ణయ కమిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అప్రూవ్ చేసింది. ఈ డాక్యుమెంట్‌ను కోర్టు మ్యాటర్‌ల కోసం రూపొందించినట్టు ఈసీ సభ్యులు పీటీఐకి తెలిపారు.

ఈ రూల్స్ పై ఏబీవీపీ స్పందించింది. కొత్త రూల్స్ తుగ్లఖీ తరహా ఉన్నాయని ఏబీవీపీ జేఎన్‌యూ సెక్రెటరీ వికాస్ పటేల్ అన్నారు. పాత కోడ్ ఆఫ్ కాండక్ట్ అన్ని రకాల పరిస్థితులకు సరిపోతుందని అభిప్రాయపడ్డారు. ఈ డ్రకోనియన్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, దీనిపై జేఎన్‌యూ వీసీ శాంతిశ్రీ డీ పండిత్ స్పందన కోరే ప్రయత్నం చేసినా సాధ్యం కచాలేదు.

Also Read: కొన్ని అంశాల్లో ప్రపంచ పాలన విఫలమైంది - జీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో ప్రధాని మోడీ

ఈ రూల్స్ యూనివర్సిటీ విద్యార్థులు, పార్ట్ టైమై్ విద్యార్థులు సహా అందరికీ వర్తిస్తాయి. ఈ పనిష్మెంట్లు మొత్తం 17 రకాల ‘నేరాల’ గురించి వివరించింది. అందులో గ్యాంబ్లింగ్, హాస్టల్ గదుల్లో అక్రమంగా అనుమతుల్లేకుండా ఉండటం, అసభ్యకర, అభ్యంతరకర భాష, ఫోర్జరీకి పాల్పడటం వంటి చర్యలను పేర్కొంది. ఈ రూల్స్ డాక్యుమెంట్ నకళ్లను విద్యార్థుల తల్లిదండ్రులకు పంపించనున్నట్టు ఆ డాక్యుమెంట్‌లో పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi
మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu