జమ్మూ కాశ్మీర్ లో భూకంపం సంభవించింది. కత్రాకు తూర్పున 97 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 3.6గా నమోదు అయ్యింది.
జమ్మూ కాశ్మీర్‌లోని కత్రాలో శుక్రవారం తెల్లవారుజామున ప్రకంపనలు సంభవించాయి. నేటి ఉదయం 5.01 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 3.6 తీవ్రతతో భూకంపం నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.భూకంపం 10 కిలోమీటర్ల లోతులో నమోదైంది.
వివాహేతర సంబంధం : ప్రియుడితో పారిపోయి, తిరిగొచ్చి.. ప్రశ్నిస్తున్నాడని భర్తను హతమార్చిన భార్య..
‘‘17.02.2022న 3.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. జమ్మూ కాశ్మీర్ లోని కత్రాలో 10 కిలో మీటర్ల లోతులో ఉదయం 05:01:49 (ఐఎస్టీ)న ఇది చోటు చేసుకుంది. ’’ అని ఎన్ సీఎస్ ఓ ట్వీట్ లో పేర్కొంది. భూకంపం సంభవించిన ప్రదేశం కత్రాకు తూర్పున 97 కిలోమీటర్ల దూరంలో ఉంది.
నిర్మాణంలో ఉన్న మసీదును ధ్వంసం చేసిన భజరంగ్ దళ్, వీహెచ్ పీ కార్యకర్తలు.. యూపీలో ఘటన
కాగా.. గురువారం సెంట్రల్ ఫిలిప్పీన్స్ లో 6.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది.స్థానిక కాలమానం ప్రకారం 16వ తేదీన తెల్లవారు జామున 2:00 గంటల తర్వాత (1800 జీఎంటీ) ఆర్కిపెలాజిక్ దేశం మధ్యలో ఉన్న మాస్బేట్ ద్వీప ప్రావిన్స్ లోతైన భూకంపం సంభవించిందని జియోలాజికల్ సర్వే పేర్కొంది. సమీప గ్రామానికి 11 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అయితే, ప్రస్తుతం పరిస్థితులను పరిగణలోకి తీసుకుని భూకంపం కారణంగా సునామీ సంభవించే అవకాశముందని పేర్కొంది. అయితే, సునామీ హెచ్చరికల గురించి అధికారిక ఉత్తర్వులు జారీ చేయలేదు.
Earthquake of Magnitude:3.6, Occurred on 17-02-2023, 05:01:49 IST, Lat: 33.10 & Long: 75.97, Depth: 10 Km ,Location: 97km E of Katra, Jammu and Kashmir, India for more information Download the BhooKamp App https://t.co/dNYT7T7sLG pic.twitter.com/s5TTbI8b9L
— National Center for Seismology (@NCS_Earthquake)ఈ నెల 13వ తేదీన సిక్కింలో కూడా భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదు అయ్యింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం ఫిబ్రవరి 13వ తేదీ ఉదయం 4.15 గంటలకు సిక్కింలోని యుక్సోమ్‌కు వాయువ్యంగా భూకంపం సంభవించింది. అయితే ఆదివారం మధ్యాహ్నం అస్సాంలోని నాగోన్‌లో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. అది చోటు చేసుకున్న ఒక రోజు తర్వాత ఈ భూకంపం రావడం గమనార్హం. దాని కంటే ఒక రోజు ముందు, గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో 3.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి.
ఫేక్ కాల్ సెంటర్లపై సీబీఐ పంజా.. రూ. 3 కోట్లు స్వాధీనం
భూమి లోపల ఏడు పలకలు నిరంతరం తిరుగుతూ ఉండటమే ఈ భూకంపాలకు కారణం. ఈ ప్లేట్లు ఎక్కువగా ఢీకొనే ప్రదేశాలను ఫాల్ట్ లైన్స్ అంటారు. ఇవి తరచుగా ఢీకొంటూ ఉంటాయి. దీని వల్ల ప్లేట్లు విరిగిపోతాయి. వాటి విచ్ఛిన్నం కారణంగా లోపల ఉన్న శక్తి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో అది ఓ మార్గాన్ని కనుగొంటుంది. దీనినే భూకంపం అని అంటారు.