బెంగళూరులో భూప్రకంపనలు.. తీవ్రత 3.3గా నమోదు...

Published : Dec 22, 2021, 10:12 AM IST
బెంగళూరులో భూప్రకంపనలు.. తీవ్రత 3.3గా నమోదు...

సారాంశం

 ఈ ఉదయం 7.14 గంటలకు ప్రకంపనలు వచ్చాయని తెలిపింది. భూకంప కేంద్రం భూమికి 23 కిలోమీటర్ల లోతున ఉందని చెప్పింది. భూ ప్రకంపనలతో ఉలిక్కి పడిన జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ప్రకంపనలు ఆగిపోయిన తర్వాత మళ్లీ ఇళ్లలోకి అడుగుపెట్టారు. 

కర్ణాటక రాజధాని bengaluruలో భూకంపం సంభవించింది. ఉత్తర, ఈశాన్య బెంగళూరులో భూ ప్రకంపనలు జనాలను వణికించాయి. రిక్టర్ స్కేల్ మీద భూకంపం తీవ్రం 3.3గా ఉంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఈ ఉదయం 7.14 గంటలకు ప్రకంపనలు వచ్చాయని తెలిపింది. 

భూకంప కేంద్రం భూమికి 23 కిలోమీటర్ల లోతున ఉందని చెప్పింది. భూ ప్రకంపనలతో ఉలిక్కి పడిన జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ప్రకంపనలు ఆగిపోయిన తర్వాత మళ్లీ ఇళ్లలోకి అడుగుపెట్టారు. 

ఇదిలా ఉండగా, మంగళవారం యూఎస్‌లోని కాలిఫోర్నియా భారీ తీవ్రతో కూడిన Earthquake సంభవించింది. Northern California తీరంలో రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని US Geological Survey తెలిపింది. భూకంప ప్రభావంతో కొన్ని బిల్డింగ్‌లు షేక్ అయ్యాయని.. పలు షాపుల్లో వస్తువులు కిందపడిపోయాయి. జన సాంద్రత తక్కువగా ఉండే ఆ ప్రాంతంలో తక్కువ నష్టమే వాటిల్లింది. సోమవారం మధ్యాహ్నం తర్వాత భూకంపం సంభవించిందని.. శాన్‌ఫ్రాన్సిస్కోకు వాయువ్యంగా 337 కిలోమీటర్ల దూరంలో ఉన్న తీరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. అక్కడికి అతి సమీపంలోనే ఉన్న పెట్రోలియా అనే చిన్న పట్టణంలో 1,000 కంటే తక్కువ మంది నివసిస్తున్నారు. 

Tsunami Warning: ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

భూకంప ప్రభావంతో దాదాపు 25,000 మంది ప్రజలు మాత్రమే బలమైన వణుకుకు గురయ్యారని US జియోలాజికల్ సర్వే తెలిపింది. అయినప్పటికీ.. శాక్రమెంటో, శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా వరకు ఉన్న నివాసితులు వణుకుతున్న ఫీలింగ్ పొందారని నివేదించింది. అయితే ఈ భూకంపం అనంతరం ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయబడలేదు. అంతేకాకుండా హంబోల్ట్ కౌంటీ షెరీఫ్ అత్యవసర సేవల కార్యాలయం.. ఎటువంటి తరలింపు ఉత్తర్వులు జారీ చేయలేదు. అయితే భూకంపం కారణంగా రాళ్లు విరిగిపడటంతో కొన్ని రోడ్లు మూసివేయబడ్డాయి. 

ఇక, ఈ భూకంపం వల్ల 10 మిలియన్ డాలర్ల కంటే తక్కువ ఆర్థిక నష్టం చోటుచేసకుందని యూఎస్ జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. ఈ కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని తెలిపింది. ఈ ప్రాంతంలో చివరిసారిగా 1993లో ఇదే విధమైన భూకంపం సంభవించిందని.. అప్పుడు ఒక వ్యక్తి మరణించాడని పేర్కొంది.

తమిళనాడులో స్వల్ప భూకంపం..!

పెట్రోలియాలోని జనరల్ స్టోర్ మేనేజర్ జేన్ డెక్స్టర్ మాట్లాడుతూ.. సుమారు 20 సెకన్ల పాటు శబ్దం, వణుకు కొనసాగిందని తెలిపారు. స్టోర్‌లోని షెల్ఫ్‌ల నుంచి వస్తువులు పడిపోయాయని చెప్పారు. గాజు సీసాలు పడిపోయి పగిలిపోయాయని.. కానీ ఎవరూ గాయపడలేదని అన్నారు. ఇక, కాలిఫోర్నియా అత్యవసర సేవల కార్యాలయం.. ముందస్తు హెచ్చరిక వ్యవస్థ మైషేక్ ద్వారా భూకంపం గురించి రాష్ట్రంలోని 2,500 మందిని అలర్ట్ చేసింది.

PREV
click me!

Recommended Stories

Viral News : ఇక జియో ఎయిర్ లైన్స్.. వన్ ఇయర్ ఫ్రీ..?
Viral News: పెరుగుతోన్న విడాకులు.. ఇకపై పెళ్లిళ్లు చేయకూడదని పండితుల నిర్ణయం