Karnataka: దేశంలో ఒమిక్రాన్ భయాందోళనలు క్రమంగా పెరుగుతున్నాయి. నిత్యం ఈ వేరియంట్ కేసులు వెలుగుచూస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలావుండగా, క్రిస్‌మస్, న్యూఇయర్ వేడుకలకు ప్రజలు సిద్దమవుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా కర్నాటక సర్కారు న్యూ వేడుకలపై ఆంక్షలు విధించింది.
Karnataka: ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పంజా విసురుతోంది. దక్షిణాఫ్రికా, బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాల్లో ఈ రకం కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అక్కడ పరిస్థితులు దారుణంగా మారుతుండటంలో ప్రపంచ దేశాలు సైతం కొత్త వేరియంట్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారత్ లోనూ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నిత్యం నమోదుకావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే దేశంలో కొత్త వేరియంట్ కేసులు 200 దాటాయి. ఈ క్రమంలోనే కేసులు నమోదువుతున్న రాష్ట్రాలు పరిస్థితులు మరింతగా దిగజారకముందే చర్యలు కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కర్నాటక సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. కోవిడ్-19 వ్యాప్తి కారణంగానే నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సర్కార్ ప్రకటించింది. డిసెంబరు 30 నుంచి జనవరి 2 వరకు బహిరంగంగా జరిగే అన్ని వేడుకలను నిషేధించింది.
Also Read: అంగన్‌వాడీలకు అత్యధిక వేతనాలు తెలంగాణలోనే : మంత్రి సత్యవతి రాథోడ్
undefined
కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలోనే కొత్త సంవత్సర వేడుకలపై నిషేధం విధిస్తున్నట్టు కర్నాటక సర్కారు స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ప్రజలందరూ కరోనా మహమ్మారి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. వ్యాక్సిన్ వేసుకోనివారు పబ్బులు, రెస్టారెంట్లలో వేడుకల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. క్లబ్‌లు, పబ్‌లలో డీజేలు, ప్రత్యేక ఈవెంట్‌లు నిర్వహించకూడదని పేర్కొంది. పబ్ లలో ప్రవేశం 50 శాతం సామర్థ్యానికి పరిమితం చేయబడింది. రాష్ట్రంలో ఎక్కడా పెద్ద ఎత్తున పార్టీలను అనుమతించడం లేదని ప్రభుత్వం సృష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. భౌతికదూరం తప్పనిసరిగా పాటిస్తూ పబ్బులు, రెస్టారెంట్లలో వేడుకల్లో పాల్గొనేందుకు అనుమతిచ్చింది. దీంతో పాటు కొత్త సంవత్సర వేడుకలు అపర్ట్ మెంట్ల లో చేసుకోవడంపైనా పలు ఆంక్షలు విధించింది. అపార్ట్‌మెంట్‌లలో డీజేల వినియోగంపై కూడా నిషేధం ఉంటుందని తెలిపింది. అంతర్గత ప్రదేశాల్లో 50శాతం సామర్థ్యంతో వేడుకలకు అనుమతినిచ్చింది.
Also Read: Rahul Gandhi: మోడీ సర్కారు ఏర్పడ్డాకే మూకదాడులు.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్
రాష్ట్రంలో కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు సైతం పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. మంగళవారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అధ్యక్షతన ఉన్నతాధికారులు, కరోనా వైరస్ నిపుణుల కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి, రాష్ట్ర పరిస్థితులపై చర్చించారు. ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఈ క్రమంలోనే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.. కొత్త సంవత్సర వేడుకలపై నిషేధం విధించింది. ఇదిలా వుండగా, రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 30,02,944 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. అలాగే, వైరస్ తో పోరాడుతూ 38,295 మంది మరణించారు. మొత్తం కేసుల్లో 29,57,546 మంది కోవిడ్-19 నుంచి కోలుకున్నారు. కొత్తగా వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ కేసులు దేశంలో డబుల్ సెంచరీ దాటగా.. కర్నాటకలో మొత్తం 19 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
Also Read: AP: బీ ఫార్మసీ విద్యార్థిపై కత్తితో దాడి.. విజయనగరంలో ఘటన