బంగ్లాదేశ్ లో భూకంపం.. భారత్ లోని అసోం, ఈశాన్య రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు

Published : Jun 16, 2023, 01:00 PM IST
బంగ్లాదేశ్ లో భూకంపం.. భారత్ లోని అసోం, ఈశాన్య రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు

సారాంశం

బంగ్లాదేశ్ లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 4.8గా నమోదు అయ్యింది. అయితే ఈ భూకంప తీవ్రత వల్ల భారత్ లోనూ భూ ప్రకంపనలు వచ్చాయి. 

బంగ్లాదేశ్ లో శుక్రవారం 4.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. అస్సాంలోని గౌహతి, ఈశాన్య ప్రాంతంలోని ఇతర ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. భూకంప కేంద్రం బంగ్లాదేశ్ లో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఉదయం 10.16 గంటలకు భూప్రకంపనలు సంభవించాయి. భూకంప ధాటికి ప్రాణ, ఆస్తి, ప్రాణ నష్టంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారమూ లేదు.

దేవేంద్ర ఫడ్నవీస్ కు, నాకు మధ్య ఫెవికాల్ బంధం.. అది తెగిపోదు - మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే..

కాగా.. జూన్ 11వ తేదీన కూడా అస్సాంలోని మధ్య భాగంలో 3.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఆ భూప్రకంపనల్లో ఎవరికీ గాయాలు కాలేదు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని ఎన్ సీఎస్ తెలిపింది. బ్రహ్మపుత్ర నది ఉత్తర ఒడ్డున ఉన్న సోనిత్‌పూర్ జిల్లాలో భూకంప కేంద్రం ఉదయం 11:35 గంటలకు నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నివేదిక పేర్కొంది.

కాగా.. మంగళవారం తెల్లవారుజామున, తూర్పు కాశ్మీర్‌లో మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో 5.4 తీవ్రతతో భూకంపం వచ్చిందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. దోడా జిల్లాలోని గండో భలెస్సా గ్రామానికి 18 కిలోమీటర్ల దూరంలో 30 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది.

సెంథిల్ బాలాజీ శాఖలను తొలగించాలని సిఫార్సు చేసిన తమిళనాడు సీఎం.. తిరస్కరించిన గవర్నర్ ఆర్ఎన్ రవి..

భూమి లోపల ఏడు పలకలు నిరంతరం తిరుగుతూ ఉండటమే ఈ భూకంపాలకు కారణం. ఈ ప్లేట్లు ఎక్కువగా ఢీకొనే ప్రదేశాలను ఫాల్ట్ లైన్స్ అంటారు. ఇవి తరచుగా ఢీకొంటూ ఉంటాయి. దీని వల్ల ప్లేట్లు విరిగిపోతాయి. వాటి విచ్ఛిన్నం కారణంగా లోపల ఉన్న శక్తి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో అది ఓ మార్గాన్ని కనుగొంటుంది. దీని వల్ల ఆ ప్రాంతంలో భూమి కంపిస్తుంది. దీనినే భూకంపం అని అంటారు. 
 

PREV
click me!

Recommended Stories

Special Trains for Sankranti Festival: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు| Asianet News Telugu
Real estate: నెల రోజుల్లో రూ. 20 ల‌క్ష‌ల లాభం.. అక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ అంతలా ఎందుకు పెరుగుతోంది.?