అరుణాచల్ ప్రదేశ్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 4.5 తీవ్రత నమోదు..

Published : May 22, 2023, 12:18 PM IST
అరుణాచల్ ప్రదేశ్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 4.5 తీవ్రత నమోదు..

సారాంశం

అరుణాచల్ ప్రదేశ్ లో భూకంపం సంభవించింది. చాంగ్లాంగ్ కు ఆగ్నేయంగా 86 కిలోమీటర్ల దూరంలో వచ్చిన ఈ భూప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.5గా నమోదు అయ్యింది. దీని వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టమూ జరగలేదు. 

అరుణాచల్ ప్రదేశ్ లో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. 8.15 గంటలకు ఒక్క సారిగా చాంగ్లాంగ్ కు ఆగ్నేయంగా 86 కిలోమీటర్ల దూరంలో భూప్రకంపనలు వచ్చాయి. అయితే దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.5గా నమోదు అయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. కాగా.. ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టమూ సంభవించలేదు.

ఇంటి పైకప్పుపై బాణాసంచా తయారు చేస్తుండగా పేలుడు.. ముగ్గురు మృతి.. ఎక్కడంటే ?

భూకంప కార్యకలాపాలను పర్యవేక్షించే నోడల్ ఏజెన్సీ అయిన ఎన్ సీఎస్ ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. ‘‘22వ తేదీ, సోమవారం భారత కాలమాన ప్రకారం 8.15 గంటలకు భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.5గా నమోదు అయ్యింది’’ అని పేర్కొంది. 

మే 20న మణిపూర్ లోని షిరుయి గ్రామంలో రిక్టర్ స్కేలుపై 3.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. మణిపూర్ లోని షిరూయికి వాయవ్యంగా 3 కిలోమీటర్ల దూరంలో రాత్రి 7.31 గంటలకు భూప్రకంపనలు సంభవించాయి. భూకంప లోతు 31 కిలోమీటర్లుగా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ఒక ప్రకటనలో తెలిపింది.

నెమలి ఈకలు పీకి, చిత్ర హింసలు పెట్టి చంపిన యువకుడు.. వీడియో తీస్తూ పైశాచికానందం.. సోషల్ మీడియాలో వైరల్

అలాగే ఉత్తర కాలిఫోర్నియా తీరంలో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.5గా నమోదు అయ్యింది. అయితే ఈ భూ ప్రకంపనల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టమూ జరగలేదని యుఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్డీఎస్) తెలిపింది. గ్రామీణ హంబోల్ట్ కౌంటీలో సుమారు 1,000 మంది జనాభా ఉన్న పెట్రోలియాకు పశ్చిమాన 108 కిలోమీటర్ల (67 మైళ్ళు) దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు యుఎస్డీఎస్ పేర్కొంది.

విషాదం.. బావి శుభ్రం చేస్తుండగా వెలువడిన విష వాయువులు.. ముగ్గురు మృతి

ఈ భూకంపం వల్ల ఉత్తర కాలిఫోర్నియాలోని తక్కువ జనాభా ఉన్న ప్రాంతంలోని కొన్ని పట్టణాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయని పేర్కొంది. కాగా.. కాలిఫోర్నియాలో భూకంపాలు సర్వసాధారణం. డిసెంబరులో ఉత్తర కాలిఫోర్నియా తీరానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 12 మందికి గాయాలయ్యాయి. ఇద్దరు మరణించారు.

PREV
click me!

Recommended Stories

Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?
Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?