ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో మళ్లీ భూకంపం.. 48 గంటల్లో రెండో సారి

Published : Oct 05, 2023, 08:22 AM IST
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో మళ్లీ భూకంపం.. 48 గంటల్లో రెండో సారి

సారాంశం

ఉత్తరఖాండ్ లో మళ్లీ భూకంపం సంభవించింది. నేటి తెల్లవారుజామున 3.49 గంటలకు భూ ప్రకంపనలు మొదలయ్యాయి. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 3.2గా నమోదు అయ్యింది. అంతకు ముందు రోజు కూడా పితోర్ గఢ్ లో 4.3 తీవ్రతతో భూకంపం వచ్చింది.

ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ జిల్లాలో గురువారం తెల్లవారుజామున భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.2 గా ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. నేటి తెల్లవారుజామున 3.49 గంటలకు భూప్రకంపనలు సంభవించగా, భూకంప కేంద్రం 5 కిలోమీటర్లుగా నమోదైంది. ఈ విషయాన్ని ఎన్ సీఎస్ ఎక్స్ (ట్విట్టర్) వేధికగా వెల్లడించింది. 

వనపర్తిలో దారుణం.. సొంత అన్నను నరికి చంపిన తమ్ముళ్లు.. ఆస్తి వివాదాలే కారణం..

48 గంటల వ్యవధిలో రాష్ట్రంలో నమోదైన రెండో భూకంపం ఇది. ఈ భూకంపానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. పితోర్ గఢ్ లో మంగళవారం 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. అంతకుముందు ఇదే రోజు నేపాల్ లో వరుసగా నాలుగు భూకంపాలు సంభవించాయి. ఉత్తరాఖండ్ లోని పుణ్యక్షేత్రమైన జోషిమఠ్ కు ఆగ్నేయంగా 206 కిలోమీటర్ల దూరంలో, ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు 284 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

ఢిల్లీ ఎన్సీఆర్, పంజాబ్, హర్యానా, ఉత్తర్ప్రదేశ్ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఈ భూకంపం ప్రకంపనలు సంభవించాయి. మధ్యాహ్నం 2:25 గంటలకు పశ్చిమ నేపాల్ లో 10 కిలోమీటర్ల లోతులో 4.6 తీవ్రతతో భూకంపం సంభవించడంతో నేపాల్ భూకంపాల పరంపర మొదలైందని ఎన్ సీఎస్ అధికారి ఒకరు తెలిపారు.

బాయిలర్ ఏర్పాటుకు అనుమతి కోసం లంచం డిమాండ్.. ఏసీబీ వలలో డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ బాయిలర్స్‌

ఆ తర్వాత మధ్యాహ్నం 2.51 గంటలకు 6.2 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. ఆ తర్వాత అదే ప్రాంతంలో మధ్యాహ్నం 3.06 గంటలకు 15 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల లోతులో 3.6, 3.1 తీవ్రతతో మరో రెండు ప్రకంపనలు సంభవించాయి. నేపాల్ లో సంభవించిన భూకంపాల్లో డజను మందికి పైగా గాయాలపాలయ్యారు. 

PREV
click me!

Recommended Stories

Modi Putin Meeting: మోదీ, పుతిన్ భేటీతో మనకు జరిగేదేంటీ.? రష్యా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది.?
Hubballi : వధూవరులు లేకుండానే రిసెప్షన్ !