కళ్లెదుట ఘోరం జరిగినా పట్టించుకోని సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్: స్థానికుల ఆగ్రహం

Published : Oct 19, 2018, 09:35 PM ISTUpdated : Oct 19, 2018, 09:36 PM IST
కళ్లెదుట ఘోరం జరిగినా పట్టించుకోని సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్: స్థానికుల ఆగ్రహం

సారాంశం

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఘోర రైలు ప్రమాదానికి నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. అయితే ఈ వేడుకలను కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. రైల్వే సిబ్బంది నుంచి కానీ పోలీస్ సిబ్బంది నుంచి కానీ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా వేడుకలు నిర్వహించారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అమృత్‌సర్‌ : పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఘోర రైలు ప్రమాదానికి నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. అయితే ఈ వేడుకలను కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. రైల్వే సిబ్బంది నుంచి కానీ పోలీస్ సిబ్బంది నుంచి కానీ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా వేడుకలు నిర్వహించారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఈ వేడుకలకు నవజ్యోత్ సింగ్ సిద్ధూ సతీమణి నవజ్యోత్ కౌర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారని చెప్తున్నారు. నవజ్యోత్ కౌర్ మాట్లాడుతుండగానే ప్రమాదం సంభవించిందని అయినా ఆమె పట్టించుకోకుండా ప్రసంగించి వెళ్లిపోయారని మండిపడుతున్నారు. కళ్లెదుటే ఇంత ఘోరం జరిగినా కనీసం పట్టించుకోలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  

 

PREV
click me!

Recommended Stories

వెనిజులా తర్వాత ట్రంప్ టార్గెట్ ఈ దేశాలే..|Trump Next Target Which Country?| AsianetNewsTelugu
Business Ideas : కేవలం రూ.10 వేలు చాలు.. మీ సొంతింట్లోనే ఈ వ్యాపారాలు చేయండి, మంచి ఇన్కమ్ పొందండి