కరోనా భయం: సైకిల్‌పై శవాన్ని స్మశానానికి

Published : Aug 17, 2020, 09:21 PM IST
కరోనా భయం: సైకిల్‌పై శవాన్ని స్మశానానికి

సారాంశం

 కరోనా భయంతో మృతదేహాన్ని స్మశానికి తరలించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో సైకిల్ పైనే డెడ్ బాడీని తరలించారు.  ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకొంది.


బెంగుళూరు: కరోనా భయంతో మృతదేహాన్ని స్మశానికి తరలించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో సైకిల్ పైనే డెడ్ బాడీని తరలించారు. 
ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకొంది.

రాష్ట్రంలలోని బెలగావి జిల్లాలోని కిత్తూరు తాలూకా ఎమ్ కే హుబ్బలికి చెందిన ఓ వ్యక్తి కొద్ది రోజుల క్రితం చనిపోయాడు.గాంధీనగర్ కు చెందిన 71 ఏళ్ల సడేప్ప పరాసప్ప సాలగర్ రెండు రోజుల నుండి జ్వరంతో బాధపడుతున్నాడు. అతడిని కుటుంబసభ్యులు పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అయితే అతనికి  కరోనా లక్షణాలు ఉండడంతో అతడిని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.

జిల్లా కేంద్రఆసుపత్రిలో ఆదివారం నాడు ఉదయం ఆరు గంటలకు ఆయన మరణించారు. అయితే డెడ్ బాడీని తరలించేందుకు అంబులెన్స్ కావాలని ఆసుపత్రి సిబ్బందిని మృతుడి భార్య గంగవ్వ కోరింది. కానీ ఆసుపత్రి సిబ్బంది మాత్రం స్పందించలేదు. 

డెడ్ బాడీని స్మశానికి తరలించేందుకు బంధువులు కూడ సహకరించలేదు. దీంతో కుటుంబసభ్యులు సైకిల్ పైనే  డెడ్ బాడీని ఆసుపత్రి నుండి స్మశానికి తరలించారు.

సైకిల్ పై కుటుంబసభ్యులు శవాన్ని తీసుకెళ్లిన వీడియోను కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి డికె శివకుమార్ షేర్ చేశారు.సోమవారం నాడు ట్విట్టర్ ఖాతాలో ఆయన షేర్ చేశారు.
 

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు