నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా వేయలేం: తేల్చేసిన సుప్రీంకోర్టు

By narsimha lodeFirst Published Aug 17, 2020, 2:14 PM IST
Highlights

నీట్, జేఈఈ 2020 పరీక్షలు వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం నాడు కొట్టివేసింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్ ను సోమవారం నాడు పిటిషన్ విచారించింది. 


న్యూఢిల్లీ: నీట్, జేఈఈ 2020 పరీక్షలు వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం నాడు కొట్టివేసింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్ ను సోమవారం నాడు పిటిషన్ విచారించింది. 

కరోనా నేపథ్యలో జేఈఈ,నీట్ పరీక్షలను వాయిదా వేయాలని  విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ పరీక్షల నిర్వహణ తేదీని ఇప్పటికే మార్చారు. అయితే దేశంలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్నారు.

అతి ముఖ్యమైన పరీక్షలను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ 11 మంది విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం విచారించింది. కరోనా జాగ్రత్తలు తీసుకొంటూ ముందుకు వెళ్లాల్సిందేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

ఇప్పుడే  కాదు వచ్చే ఏడాది కూడ ఇదే రకమైన పరిస్థితి ఉంటే అప్పుడు ఏం చేస్తారు, పరీక్షలను వాయిదా వేస్తారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.  సెప్టెంబర్ 1 నుండి ఆరో తేదీ వరకు జేఈఈ మెయిన్స్  సెప్టెంబర్ 13న నీట్ ను నిర్వహించాలని కేంద్ర మానవ వనరుల శాఖ నిర్ణయం తీసుకొంది. దేశంలోని 161 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకొంది.


 

click me!